బ్యాంకు సెలవులు: ఈరోజే డబ్బులు తీసుకోండి


ఇప్పటికే పెద్దనోట్ల రద్దుతో ఏటీఎంలలో అస్సలు డబ్బులే ఉండడం లేదు. మళ్లీ బ్యాంకుల ముందు క్యూలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న బ్యాంకు వినియోగదారుల నెత్తిన వరుసగా వస్తున్న సెలవులు భయపెడుతున్నాయి. వినియోగదారులు మేల్కొకపోతే మూడు రోజులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు..

రేపటి నుంచి వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఏవైనా బ్యాంకులో పనులు ఉంటే ఈరోజే పూర్తి చేసుకోవాలని బ్యాంకర్స్ అసోసియేషన్ వినియోగదారులను కోరింది.. శని, ఆది, సోమవారాల్లో బ్యాంకులు పనిచేయవని స్పష్టం చేసింది. శుక్రవారమే అంటే ఈరోజే బ్యాంకు పనులను పూర్తి చేసుకోవాలని సూచించింది. 10న రెండో శనివారం, 11న ఆదివారం, 12న హోలీ పండుగ సందర్బంగా బ్యాంకులు సెలవులు ఉన్నాయని తెలిపారు.

ఏటీఎంలన్నీ బందే..
కాగా పెద్దనోట్ల రద్దు నుంచి ఏటీఎంలు సగం పనిచేయడం లేదు. పనిచేస్తున్న వాటిల్లో డబ్బులు పెట్టిన రెండు రోజుల్లో ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళితే అంతటా నో క్యాష్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. బ్యాంకులకు వెళితే భారీ క్యూలు వినియోగదారులను కంగారుపెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో జనాలకు మళ్లీ కరెన్సీ కష్టాలు దాపురించాయి.

To Top

Send this to a friend