బోయపాటి-బెల్లంకొండ ల సినిమా

dwaraka-prod2
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి సినిమా మేకింగ్ పట్ల విశేషమైన పట్టుతోపాటు అంతకుమించిన సెంటిమెంట్ వేల్యూస్ ఎక్కువ. అందుకే తన మొదటి చిత్రం “భద్ర” మొదలుకొని.. లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయిన “సరైనోడు” వరకూ ప్రతి సినిమాలోనూ మొదటి సన్నివేశాన్ని గచ్చిబౌలి లోని వనదేవత గుడిలో చిత్రీకరిస్తాడు. ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ను కూడా అదే ప్లేస్ లో మొదలెట్టారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన క్రేజీ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి మొదలయ్యింది. నేడు హీరోహీరోయిన్లు బెల్లంకొండ శ్రీనివాస్-రకుల్ ప్రీత్ సింగ్ లపై కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. “మా నిర్మాణ సంస్థ “ద్వారక క్రియేషన్స్”లో రూపొందుతున్న రెండో చిత్రమిది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో మా సంస్థ రెండో చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు కంప్లీట్ మేకోవర్ ఇవ్వడంతోపాటు వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు బోయపాటి” అన్నారు.
మిగతా నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సినిమాటోగ్రఫీ: ఋషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!
Attachments area
To Top

Send this to a friend