బొద్దుగుమ్మ ముద్దుగుమ్మ అయ్యిందే..!

తెలుగులో పలు చిత్రాల్లో నటించి, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ నమిత కొంత కాలంకు చాలా బొద్దుగా తయారు అయ్యింది. బొద్దుగా అయిన తర్వాత కూడా ఈమె ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. బొద్దుగా ఉన్నా కూడా తన అందాలతో అలరిస్తూ వచ్చిన ఈ అమ్మడు మళ్లీ మెల్లగా సన్నగా అవుతుంది. తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ఆమె ఎలా ఉందనే విషయాన్ని చెబుతుంది.

ఆరు నెలల క్రితం వరకు చాలా లావుగా ఉన్న నమిత అప్పటి నుండి తగ్గుతూ వస్తుంది. జిమ్‌లో రోజు గంటల తరబడి వర్కౌట్‌లు చేస్తున్న నేపథ్యంలో నమిత ఇంత బక్కగా అయ్యిందని అంటున్నారు. ఈమె ఫిజిక్‌తో మళ్లీ సినిమాల్లో అవకాశాలు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తుంది. లావు ఎక్కువగా ఉండటం వల్ల స్టార్‌ హీరోలు, చిన్న హీరోలు ఈమెతో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో బొద్దుగుమ్మ కాస్త ముద్దుగుమ్మ అయిన నేపథ్యంలో మళ్లీ అవకాశాలు వస్తాయేమో చూడాలి.

To Top

Send this to a friend