బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డ్ అందుకున్న ‘ర్యాప్ రాక్ షకీల్’

best-music-director-shakeel
ఇటీవల మయూరి ఆర్ట్స్, స్వర్ణ భారతి ఫౌండేషన్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ర్యాప్ రాక్ షకీల్ “చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే” ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకున్నాడు. “రణం 2 చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన ర్యాప్ రాక్ షకీల్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చిత్రాలు చేస్తూ ముందుకు దూసుకేలుతున్నాడు. “రణం 2, మనసంతా నువ్వే 2016, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే, శ్రీకాంత్ రాబోయే చిత్రం “రా.. రా.., ఘోస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ” చిత్రాలు కూడా చేస్తున్నాడు.  ఇప్పటికే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే సినిమా పాటలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. షకీల్ ప్రస్తుతం 3 తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమా, ఒక తమిళ్ సినిమాకు సంగీతాన్ని అందించే పనిలో ఉన్నాడు. ఇలాంటి అవార్డులు షకీల్ మరెన్నో అందుకోవాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టు షకీల్.
To Top

Send this to a friend