బెలూన్‌..కీల‌క పాత్ర‌ రాజ్ త‌రుణ్‌

జై, అంజ‌లి, జ‌న‌ని అయ్య‌ర్ హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ `బెలూన్‌`. జ‌ర్నీ త‌ర్వాత జై, అంజ‌లి క‌లిసి న‌టిస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. హీరోలు కార్తీ, జ‌యం ర‌వి, విజ‌య్ ఆంటోని, విష్ణు విశాల్‌, సూర్య చేతుల మీదుగా విడుద‌లైన ఐదు డిఫ‌రెంట్ లుక్స్‌తో పాటు ప్రీ రిలీజ్ లుక్ సినిమా ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచాయి.
శినిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని మ‌హేష్ గోవింద‌రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో పుష్య‌మి ఫిలిం మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బెల్లం రామ‌కృష్ణారెడ్డి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ ఈ సినిమాలో కీల‌క‌మైన పాత్ర చేయ‌డం విశేషం. తెలుగులో ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను త్వ‌రలోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
రెండు షెడ్యూల్స్ చెన్నైలో పూర్త‌య్యాయి. ఫైన‌ల్ షెడ్యూల్‌ను కొడైకెనాల్‌లో షూట్ చేస్తున్నారు. నాగినీడు విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుంటే, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం, శ‌ర‌వ‌ణ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, రూబెన్ ఎడిటింగ్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.

To Top

Send this to a friend