బెడ్రూమ్ కు వెళ్లి ఉంటే టాప్ హీరోయిన్ అయ్యేదాన్ని..

మొన్న టాప్ హీరోయిన్ రాధిక ఆప్టే.. నిన్న తమిళ శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ, ఇవ్వాళ మలయాళ నటి పార్వతి మీనన్ అదే మాట.. ‘హీరోయిన్లు ఎదగాలంటే హీరోలు, దర్శకుల పక్కలో పడుకోవాల్సిందే.. లేదంటే అవకాశాలు రావు.. టాప్ హీరోయిన్ కావు.. దానికి నో చెప్పాను కనుకే తాను ఇప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందని.. ’ హీరోయిన్ పార్వతీ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్వతీ మీనన్ తాజాగా ఓ టీవీచానల్ ఇంటర్వ్యూలో తన అనుభవాల గురించి.. ఎదురైన సంఘటనలను వివరించి కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా పార్వతీ మాట్లాడుతూ ‘ప్రస్తుతం సినీ పరిశ్రమ గురించి జరుగుతున్న ప్రచారం నిజమే.. అక్కడ అవకాశాలు కావాలంటే అన్నింటిని వదులుకోవాల్సిందే.. అవకాశం కావాలంటే బెడ్రూమ్ కు రమ్మని డైరెక్టుగానే అడుగుతారు.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో పలువురు హీరోలు, దర్శకులు నన్ను తమ బెడ్రూమ్ కు రమ్మనేవారు.. అవకాశాలు కావాలంటే అది కామన్ అని చెప్పేవారు.. నేను అందుకో నో అన్నా కాబట్టే ఈరోజు ఇంట్లో ఉన్నా’ అని పార్వతీ కుండ బద్దలు కొట్టారు.

పార్వతీ కొన్ని సినిమాల్లో నటించింది.. తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘మారియన్’, ఆర్య, రానాలతో ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం సొంత ఇండస్ట్రీ అయినా తక్కువే నటించింది. హీరోయిన్లు కావాలంటే పడుకోవాల్సిందేనన్న పార్వతీ మాటలతో మరోసారి సినిమా ఇండస్ట్రీ తెరవెనుక బాగోతం మనముందు ఆవిష్కృతమైంది.

To Top

Send this to a friend