బూట్లు నాకే టైపు కాదు.. అందుకే మంత్రిని కాలేదు..

‘చూడప్పా.. రెడ్డప్పా నేను సింహం లాంటోన్ని.. అది అడగదు.. నేనూ అడుక్కోను..’ అంటూ కొత్త భాష్యం చెబుతున్నాడు మన రెడ్డప్ప ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. రాయలసీమలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును జేసీ దివాకర్ రెడ్డి ఆకాశానికెత్తేశాడు.. సభావేదికపైనే మా ప్రతిపక్షనేత రెడ్డి వర్గమైన జగన్ వేస్ట్ అని.. చంద్రబాబు బెస్ట్ అని కితాబిచ్చాడు. అభివృద్ది చేస్తున్న చంద్రబాబును చూసి ఓటేయాలని రెడ్లందరికీ పిలుపునిచ్చారు.. తాను మిగతా ప్రజాప్రతినిధులు లాగా అధినేతల బూట్లు నాకే మనస్తత్వం గల వాణ్ని కాదని.. అందుకే ఇప్పటికీ మంత్రిని కాలేదని స్పష్టం చేశారు..

జేసీ తన ప్రసంగంలో జగన్ మోహన్ రెడ్డిని కడిగేశాడు.. తన కులమైన రెడ్లందరూ బాబుకు సాగిలపడాలని.. అంతలా అభివృద్ధి చేస్తున్నాడని చంద్రబాబుకు ఊడిగం చేయాలని పిలుపునిచ్చాడు.. నాడు గతంలో కాంగ్రెస్ లో ఉండి అలాగే సోనియాను మోసిన జేసీ.. అనంతరం రాష్ట్రం విడిపోయాక టీడీపీలో చేరి అదే స్థాయిలో చంద్రబాబును తెగ మోసేస్తున్నాడు.. చంద్రబాబు మంత్రిపదవి ఇస్తాడనే ఆశతో ఉన్న జేసీ కనీసం టీటీడీ చైర్మన్ పదవిని అయినా పొందవచ్చని ఆశిస్తున్నాడు.. కానీ బాబు నోటి వెంట ఏదీ రాకపోవడంతో అంత పొగిడినా ఏం లాభం లేకపోయిందని కింది స్థాయి నాయకులు గుసగులాడుకున్నారు..

To Top

Send this to a friend