బీజేపీ వచ్చే..కోళ్లఫారం పాయే..


పవన్ కల్యాణ్ కు వీరభక్తుడిగా పేరుపొందిన బండ్ల గణేష్ అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ ప్రస్తుతం నిర్మాతగా ఎదిగారాయన.. రెండు వేల కోళ్లతో ఓ చిన్న కోళ్ల ఫారం పెట్టి బిజినెస్ స్ట్రాట్ చేసిన బండ్ల గణేష్ చేతిలో ఇప్పుడు ఏపీ, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల పాతికలక్షల కోళ్లు ఉన్నాయి. వందల కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నారు. మంచి బిజినెస్ మ్యాన్ గా రూపాంతరం చెందారు..

ఇప్పుడు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ చొరవ,సపోర్ట్ తో ఉత్తరప్రదేశ్ లో పౌల్ట్రీ పరిశ్రమను విస్తరించాలని యోచించాడట.. ఇందుకోసం యూపీ వెళ్లి అక్కడ ఓ వంద ఎకరాల భూమిని సెలెక్ట్ చేసి సిద్ధం చేశాడట.. అనంతరం లగడపాటి రాజగోపాల్ ద్వారా యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తో మాట్లాడి తక్కువ ధరకే భూమి పొందాడట.. ఎన్నికలయ్యాక అఖిలేష్ ముఖ్యమంత్రిగా అయ్యాక పౌల్ట్రీ స్టార్ట్ చేస్తాని ధీమాగా బండ్ల ఉన్నాడట.. కానీ అర్థంతరంగా ఎన్నికల్లో అఖిలేష్ ఓడిపోవడం.. బీజేపీ అఖండ మెజార్టీతో గద్దెనెక్కడంతో ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.

అఖిలేష్ కేటాయించిన వంద ఎకరాలను బీజేపీ పునరుద్ధరిస్తుందో లేదో తెలియని పరిస్థితి.. అక్కడ బీజేపీ సపోర్టు లేకుండా బండ్ల గణేష్ ముందుకు సాగని పరిస్థితి. లగడపాటి పప్పులు ఇప్పుడు అక్కడ ఉడకవు. దీంతో తన వ్యాపారాన్ని ఉత్తరప్రదేశ్ లో విస్తరించడం కష్టమనుకొని బండ్ల గణేష్ ఊరుకున్నాడట.. యూపీలో అధికార మార్పు బండ్ల గణేష్ కు ఎంతటి కష్టం తీసుకొచ్చిందో చూడండి..

To Top

Send this to a friend