బీజేపీ ఇక్కడ అస్సలు రాదు.. ఎందుకంటే


ఉత్తరాది వారికి దక్షిణాది వారికి మైండ్ సెట్ లో చాలా తేడా ఉంటుంది. మోడీ ఉత్తరాది అభిమానాన్ని కొల్లగొట్టి అక్కడ ఎన్ని సీట్లు సాధించినా కూడా దక్షిణాది జనాల్ని మెప్పించలేరు. ఇక్కడ వ్యక్తి ఆరాధన చాలా తక్కువ.. అది సుస్పష్టం. అంతేకాదు.. తమ సొంత పార్టీలపై, ప్రాంతీయ పార్టీలపై మక్కువ ఎక్కవ. అందుకే ఇన్ని దశాబ్దాలు అవుతున్నా తమిళనాడు, కేరళ, ఏపీ,తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీజేపీ లాంటి జాతీయ పార్టీ వేల్లూనుకోవడం లేదు. గెలిచిందీ లేదు..

* ప్రాంతీయతత్వమే పరమావధి
తెలుగునాట అయినా తమిళనాడు , కేరళ అయినా మన వాళ్లకే పట్టం కడతారు. ఇక్కడ ప్రాంతీయ తత్వం ఎక్కువ. తమిళనాట అయితే దేవుళ్లుగా చూస్తారు. మొన్న చనిపోయిన జయలలితను కానీ హీరో రజినీకాంత్ లకు కానీ వీళ్లు ప్రాణమిస్తారు. తెలుగు నాట ఎన్టీఆర్ కు ఈ స్థాయి అభిమానం ఉంది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించారు . ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్పై జనాలకు ప్రేమ ఉంది. రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా ఆయనపై విపరీత అభిమానం జనాల్లో ఉంది. దక్షిణాదిన స్థానిక నాయకులపైనే జనం ఎక్కువ ఆధారపడతారు. ఆరాదిస్తారు. ఇక్కడ ఉత్తరాది పార్టీలు, నాయకుల ప్రభావం చాలా తక్కువ.. వచ్చే ఎన్నికల నాటికి ఎన్ని విజయాలు సాధించినా కూడా మోడీ-బీజేపీ హవా తెలుగు నాట మచ్చుకైనా కనపించందనడంలో ఎలాంటి సందేహం లేదు.

* కేసీఆర్, చంద్రబాబులుండగా.. మోడీ దండగ..
తెలుగు ప్రజలకు ఏదైనా తొందరగా కావాలి.. సంక్షేమంలో తెలంగాణ, ఆంధ్ర దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం నుంచి బాగా ఆశిస్తారు. రేషన్, పింఛన్లు, కళ్యాణలక్ష్మీ ఆసరా సహా చాలా పథకాలు జనాలకు చేరుతున్నాయి. నాటు ఎన్టీఆర్ రూ.2కు కిలోబియ్యం నుంచి తెలుగు నాట సంక్షేమ రాజ్యం కొనసాగుతోంది. దీనివల్ల ప్రజలు సోమరిపోతులవుతున్నా సరే అలా ఇచ్చినవారికే ఓట్లేసి గెలిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడే మోడీ ఫెయిల్ అవుతున్నాడు. మోడీది సంక్షేమ మనస్తత్వం కాదు. అభివృద్ధి మంత్రం. అందరికీ కేసీఆర్, బాబు లా ఫ్రీగా ఇవ్వడు.. ఉపాధి చూపిస్తాడు. పరిశ్రమలు తెస్తాడు. వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేస్తాడు. గుజరాత్ లో అలా చేసే అందరికీ సమాన పని, సమానవేతనం.. సంపాదించి పెట్టి అభివృద్ది చేశారు. కానీ తెలుగునాట ఆ ఫార్ములా అస్సలు పనిచేయదు. అందుకే ఇక్కడ బీజేపీ నిలుదొక్కుకోవడం రాణించడం కష్టం..

పైగా బీజేపీకి సరైన నాయకుడే తెలుగునాట లేడు. కేసీఆర్, బాబులకు సరితూగగల నాయకుడు భూతద్దంలో పెట్టి వెతికినా దొరకడు. అందుకే బాబు, కేసీఆర్ లను కాదని.. లోకల్ నాయకులను కాదని జనం బీజేపీకి పట్టం కట్టే పరిస్థితులు అయితే వచ్చే ఎన్నికల్లో లేవని విశ్లేషకుల అంచనా..

To Top

Send this to a friend