బీజేపీలోకి లగడపాటి ఎంట్రీకి వారే అడ్డు..

పార్లమెంటు లో పెప్పర్ స్ప్రే కొట్టి వివాదాస్పద ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీలో కాంగ్రెస్ తో పాటు అంతర్థానం అయ్యేలా ఉన్నారు. ఒకప్పుడు ఫేమస్ ఎంపీ, కాంట్రవర్సికి మారుపేరుగా ఉన్న లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు . వినిపించడం లేదు.. ఆయన చేయించే సర్వేలు కూడా ఈ మధ్య జరగట్లేదు..
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ లగడపాటిని దేశంలో ఎక్కడ ఎన్నికలున్నా ముందస్తుగా లగడపాటి తో చెప్పి సర్వేలు చేయించేవారట.. ఆ సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం ఫలితాలను ఇఛ్చేవి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా లగడపాటి సర్వేలపై విశ్వసనీయత ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ, ఏపీ విడిపోయాక లగడపాటి , ఆయన సర్వేలు రెండూ లేకుండా పోయాయి.
కానీ కొద్దిరోజులుగా లగడపాటి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆ మధ్య బీజేపీ చీఫ్ అమిత్ షా తో కలిసి లగడపాటి యూపీలో సర్వే చేస్తున్నామని.. అందులో బీజేపీ గెలుస్తుందని ఆ రిపోర్టును అమిత్ షాకు అందించారట.. దీంతో సంతోషం వ్యక్తం చేసిన అమిత్ షా లగడపాటి చేరిక విషయంలో సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది..
కాగా లగడపాటి సర్వేల విషయంలో మునుపటిలా వాడి లేదని.. ఆయన బీహార్ లో బీజేపీ గెలుస్తుందని రిపోర్టు ఇచ్చినా అక్కడ నితీష్ గెలిచారని లగడపాటిపై సర్వేలపై అమిత్ కు బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారట.. లగడపాటి సర్వేల్లో మునుపటి వాడి లేదని.. ఆయన చేరిక కూడా బీజేపీకి చేటే అని వారు గుర్తు చేశారట.. దీంతో లగడపాటి బీజేపీలో చేరిక వాయిదా పడింది. అటు సర్వేలు విఫలమై.. ఇటు భవిష్యత్ లేక లగడపాటికి గందరగోళ పరిస్థితి నెలకొంది.

To Top

Send this to a friend