బీకాంలో ఫిజిక్స్ ను ఆటపట్టించిన రోజా


కొత్త అసెంబ్లీని చూద్దామని వచ్చిన ఎమ్మెల్యే రోజా, వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు తొలిరోజు అసెంబ్లీ అంతా కలియదిరిగారు. ఎమ్మెల్యే రోజాతో పాటు మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కళావతి, పుష్ప శ్రీవాణి, రాజేశ్వరి, ఈశ్వరీ తదితరులు వైఎస్సార్ సీపీ పార్టీ లాబీల్లో ఉండగా.. అక్కడికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వచ్చారు. ఇప్పటికే ఆయన బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి మీడియాలో చాలా పాపులర్ అయ్యారు.

జలీల్ ఖాన్ ను చూసిన ఎమ్మెల్యే రోజా ‘హాయ్ ఫిజిక్స్’ అంటూ పలకరించారు. మిగతా మహిళా ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్ దగ్గరకు వచ్చి ‘మేం ధర్నాలు, పోలీసులతో అరెస్ట్ అయినా రాని పాపులారిటీ మీరు కామర్స్ లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పగానే వచ్చింది..’ అంటూ చలోక్తి విసిరారు. దీనికి కౌంటర్ గా జలీల్ ఖాన్ ‘సీదాగా చెబితే ఏ మీడియాలో వేయరు.. ఉల్టాగా చెబితే వేసి ఇలా పాపులర్ చేస్తారు. అందుకే నేను కామర్స్ లో ఫిజిక్స్ అని చెప్పా’ నని బదులిచ్చారు..

అనంతరం లాబాల్లో జలీల్ ఖాన్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, వెంకటరెడ్డిలు మాట్లాడుతూ ‘బీకాంలో ఫిజిక్స్ అంటే నేషనల్ ఫిగర్ అయ్యావన్నా.. భవిష్యత్ లో బీకాంలో ఫిజిక్స్ పెట్టొచ్చేమో.. మీ సీఎం అమరావతిని సింగపూర్ చేస్తాననగా లేనిది బీకాంలో ఫిజిక్స్ పెడితే పెద్ద తప్పుకాదులే’నని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు..

ఇలా మొత్తానికి బీకాంలో ఫిజిక్స్ అన్న జలీల్ ఖాన్ ను కొత్త అసెంబ్లీలో నాయకులు ఓ ఆట ఆడుకున్నారు. రోజా దగ్గరనుంచి ప్రతి ఒక్కరు జలీల్ ఖాన్ ను బీకాంలో ఫిజక్స్ అంటూ పలకరించడం కొసమెరుపు..

To Top

Send this to a friend