బాహుబలి2 6500 స్క్రీన్లపై


ఒకటి కాదు రెండు ఏ ఇండియన్ సినిమాను అన్ని థియేటర్లలో ప్రదర్శించి ఉండరు..కానీ జక్కన్న రాజమౌళి తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని జనాలకు చూపించేందుకు ఏకంగా దేశంలోనే అత్యదిక సినిమా థియేటర్లలో వేస్తున్నారు. ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యే ఈ సినిమాను దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్లలో విడుదల చేయాలని బాహుబలి నిర్మాతలు నిర్ణయించినట్టు సమాచారం..

బాహుబలిలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని తెరమీదే చూడాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకే ట్రైలర్ లోనూ రాజమౌళి అదే విషయాన్ని ప్రస్తావించి మరింత హైప్ ను పెంచాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా..? ఎప్పుడు చూద్దామా అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జనాస్తక్తిని అందిపుచ్చుకోవడానికి బాహుబలి నిర్మాతలు బాగా ప్లాన్ చేశారు. ఏకంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 28 దాదాపు 6500 స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు మరో వెయ్యి స్ర్కీన్లపై ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో విడుదల చేస్తున్నారు. ట్రైలర్ కు ఫుల్ రెస్పాన్స్ రావడంతో సినిమా కలెక్షన్లు వెయ్యి కోట్లు దాటుతుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. దీంతో మొదట అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్క్రీన్లను పెంచినట్టు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో బాహుబలి 2 విడుదల కాబోతోంది. ఒక భారతీయ సినిమా ఇన్ని స్క్రీన్లలో రిలీజ్ కావడం ఇదే ప్రథమం అంటున్నారు విశ్లేషకులు..

To Top

Send this to a friend