బాహుబలి2 విలన్


బాహుబలి ట్రైలర్ 2 సందర్భంగా వేదికపై బాహుబలి లో నటించిన ప్రభాస్, రానాతో పాటు కీలక వ్యక్తులు హాజరయ్యారు. ఇందులో నటుడు సుబ్బరాజు కూడా ఉండడం ఆశ్చర్యపరిచింది. కానీ ఇప్పుడు ఈ సుబ్బరాజే బాహుబలి2లో మెయిన్ విలన్ అని తేలింది..

సినిమాలోని కీలకమైన పాత్రదారులే ట్రైలర్ విడుదల సందర్భంగా కనిపించారని చిత్రం యూనిట్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే సుబ్బరాజుకు బాహుబలి2 లో కీలక పాత్ర దక్కిందని సమాచారం.

బాహుబలి1లో హీరో ప్రభాస్, రానాలతో సమానంగా పేరు తెచ్చుకున్నాడు విలన్ ‘కాలకేయ’ ప్రభాకర్. ఆ పాత్ర ప్రభాకర్ కు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా ప్రభాకర్ కు అవకాశాలు బాగా వచ్చాయి. మొదటి పార్టులో కాలకేయ చనిపోవడంతో ఆ వర్గం నుంచి మరొకరు నాయకుడిగా బాహుబలి టీంతో యుద్ధం చేస్తాడని… అతడు సుబ్బరాజేనని తేలింది. కాలకేయుడి అన్న పాత్రలో సుబ్బరాజు నటించాడని సమాచారం.

To Top

Send this to a friend