బాహుబలి2.. బీ రెడీ..


బాహుబలి2 అన్ని పనులు పూర్తయ్యాయి. తెలుగు డబ్బింగ్ పూర్తికాగా.. ఈరోజు హిందీ డబ్బింగ్ పూర్తి అయ్యింది.. దీంతో మార్చి 16న ట్రైలర్ విడుదల చేయనున్నట్టు యూనిట్, రాజమౌళి వెల్లడించారు. ఈ ట్రైలర్ ను 16న ఏపీ, తెలంగాణల్లోని అన్ని థియేటర్లలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య విడుదల చేస్తున్నట్టు బాహుబలి టీం ప్రకటించింది.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తామని తెలిపారు..

బాహుబలికి సంబంధించిన హిందీలో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పిన బాలీవుడ్ హీరో శరద్ కేల్కర్ ట్విట్టర్లో రాజమౌళితో కలిసి ఫొటో పెట్టి థ్యాంక్స్ చెప్పారు. తనకు బాహుబలి ది కంక్లూజన్ లో ఇలా అవకాశం కల్పించడం గౌరవంగా భావిస్తున్నానని రాజమౌళికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి1 కి కూడా శరద్ కేల్కరే ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పాడు. ఇది అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో మళ్లీ బాహుబలి2కు కూడా అతడితోనే డబ్బింగ్ చెప్పిస్తున్నారు. డబ్బింగ్ పూర్తికాగానే రాజమౌళితో ఫొటో దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేల్కర్..

శనివారం మధ్యాహ్నం రాజమౌళి ఫేస్ బుక్ లో తమ సినిమాకు పనిచేస్తున్న జగన్ అనే డిజైనర్ రూపొందించిన పోస్టర్ ను పోస్ట్ చేశారు. ఈ ఐడియా చాలా బాగుందని.. కానీ షెడ్యూల్ లో చేర్చలేమని చెప్పాడు. కానీ పోస్టర్ తన మనసును దోచిందని చెప్పాడు.. ‘కట్టప్ప బాహుబలిని చంపాడు .. కానీ ఆ బాలుడిని బతికించాడు’ అనే క్యాప్షన్ తో పోస్టర్ ను రాజమౌళి ఫేస్ బుక్ లో పెట్టారు..

To Top

Send this to a friend