బాహుబలి2కి రంగం సిద్ధం..


ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తున్న బాహుబలి2 రిలీజ్ కి రంగం సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 28న విడుదలయ్యే సినిమా కోసం రాజమౌళి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిపార్ట్ పెద్ద హిట్ కావడం.. చివరలో కట్టప్ప బాహుబలిని చంపడంలో సస్పెన్స్ క్రియేట్ చేసి రాజమౌళి రెండో పార్ట్ పై ఆసక్తి నింపారు. దానికోసమైనా చూడాలని అందరూ సిద్ధమవుతున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి రెండో పార్ట్ ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మార్చి 15న ఈ మూవీ ఆడియోను రిలీజ్ చేసేందుకు రాజమౌళి నిర్ణయించారు. ఈ ఆడియోను హైదరాబాద్ లోని ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలోని బాహుబలి సెట్ లో నిర్వహించాలని యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. పకడ్బందీ ప్లాన్ ఈ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బాహుబలి1 ఆడియో వేడుక చివరి నిమిషంలో రద్దు అయ్యి రాజమౌళి ఆశలు అడియాశలయ్యాయి. హైదరాబాద్ లో సెక్యూరిటీ ప్రాబ్లంతో వేడుకను నిర్వహించలేదు. చివరి నిమిషంలో తిరుపతిలో నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఈ సారి ప్రాబ్లం రాకుండా సేఫ్ సైడ్ లో రక్షణ ఏర్పాట్లు ఉండే రామోజీ ఫిలిం సిటీలోనే ఆడియో రిలీజ్ చేస్తున్నారు. మార్చి 15న నిర్వహించే ఆడియో వేడుకకు అతిరథ మహారథులు తరలివస్తున్నారట..

To Top

Send this to a friend