బాహుబలి 2.. విడుదలకు ముందే 500 కోట్ల బిజినెస్

జక్కన్నా.. మజాకా.. బాహుబలి సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించి వందల కోట్లు కొల్లగొట్టిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇప్పుడు రాబోయే బాహుబలి 2 సినిమాపై బారీగా అంచనాలు పెంచేశారు. ఆ అంచనాలకు అనుగుణంగానే సినిమాకు భారీ హైప్ వచ్చింది. సినిమా విడుదల కాకముందే వివిధ ఏరియాలకు సినిమా కోట్లకు అమ్ముడు పోయింది. మొత్తం ఇప్పటికే 500 కోట్ల బిజినెస్ జరిగినట్టు ఇండియన్ మూవీ ట్రాకర్ రమేశ్ బాల ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రిరిలీజ్ బిజినెస్ రూ.500 కోట్లు అంటూ ఆయన రాసుకొచ్చారు. డిస్ట్రి బ్యూషన్, శాటిలైట్ రైట్స్, వివిధ భాషల్లో రిలీజ్ లు ఇలా అన్నీ అందులో ప్రస్తావించారు.
రమేశ్ బాలా బాహుబలి 2 కు రూ.500 కోట్ల బిజినెస్ జరిగినట్టు ట్విట్టర్ లో పేర్కొనగానే టాలీవుడ్, బాలీవుడ్ సహా అందరూ నోరెల్లబెట్టారు. విడుదలకు ముందే ఇంత రేట్ కు అమ్ముడుపోయిన సినిమా విడుదల అయ్యాక ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

To Top

Send this to a friend