బాహుబలి 2 గురించి ఆసక్తికర విషయాలు..


బాహుబలి గ్రాండ్ హిట్.. ఆ సినిమా తర్వాత బాహుబలి2.. ప్రస్తుతం ఈ సినిమాను చెక్కే పనిలో బిజిగా ఉన్నాడు జక్కన్న రాజమౌళి. అందులో భాగంగానే శివరాత్రి కానుకగా ఓ మోషన్ పోస్టర్ ను.. దాంతో పాటు బుల్లితెర యాంకర్ సుమతో బాహుబలి2 సినిమాపై విశేషాలను మనకు వివరించారు.
బాహుబలి మొదటి పార్ట్ లో అసలు కథే స్టార్ కాలేదని.. అందంతా ఇంట్రడక్షన్ అని చెప్పారు. కథ మొత్తం రెండో పార్టులోనే ఉంటుందన్నారు. అంతేకాదు.. ఇందులో కాలకేయ పాత్ర కొంత ఉంటుందని.. అలాగే పెద్ద బాహుబలి పాత్ర చుట్టే ఇదంతా తిరుగుతుందని చెప్పాడు. రమ్యక్రిష్ణ, ప్రభాస్, అనుష్కలదీ కీరోల్ అని వివరించారు. సినిమా కోసం కష్టపడ్డ ప్రభాస్ ను వేయినోళ్ల కీర్తించాడు రాజమౌళి..
మొదటిసారి రాజమౌళి తన సినిమా కోసం వేసిన సెట్ లను సుమతో కలిసి ప్రేక్షకులకు చూపించాడు. సెల్ఫీ దిగిన సుమను సరదాగా అనుష్కను వేసిన బోన్లో వేసి ఆటపట్టించారు. ఈ ఇంటర్వ్యూ ఆసాంతం బాహుబలి2 విశేషాలపై సాగింది.
బాహుబలి 2 గురించి ఆసక్తికర విషయాలు కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend