బాలయ్య 101 మూవీ పూరి చేతిలోకి..!


హీరో బాలక్రిష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 100 వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి విడుదలై సంచలన విజయం సాధించింది. మరి 101 సినిమా ఏదీ..? ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తాడా.? లేక తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కథను ఫైనల్ చేస్తాడా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ బాలయ్య ఆశ్చర్యకరంగా తన 101 సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.
అయితే పూరి జగన్నాథ్ మహేశ్ బాబుతో తీద్దామనుకున్న ‘జనగణమణ’ మూవీ పట్టాలెక్కలేదు. దీంతో అదే కథను వెంకటేశ్ కు వినిపించగా బడ్జెట్ ప్రాబ్లంతో ఆ సినిమా ఓకే కాలేదు. దీంతో ఆశలు వదులుకున్న పూరి.. అదే కథను బాలక్రిష్ణకు చెప్పడంతో ఆయన ఓకే అన్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ మూవీ అయినా బాలయ్యను చూసి నిర్మాతలు పెడతారనే ధీమాతో పూరి ముందడుగు వేస్తున్నారు. గౌతమిపుత్ర ఘన విజయం సాధించిన తర్వాత బాలయ్య చేస్తున్న చిత్రం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది..
సోషల్ మెసేజ్ నేపథ్యంలోసాగే జనగణమణ మూవీకి బాలయ్య అయితే సూట్ అవుతుందని పూరి ప్రయత్నించడం ఓకే అనడం జరిగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆ తర్వాత తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో సినిమాకు కూడా బాలయ్య ఓకే చెప్పారు. దానికి జయసింహా, లేదా రెడ్డిగారు అనే టైటిల్ ను అనుకున్నట్టు తెలిసింది. దీంతో బాలయ్య వరుసగా రెండు సినిమాలు.. అది గొప్ప దర్శకులతో చేస్తూ బిజిగా మారిపోయాడు.

To Top

Send this to a friend