బాలయ్య చెప్పినా… మూడు కోట్లు వసూలు

ఏపీ సీఎం చంద్రబాబుకు స్వయానా బామ్మర్ధి, పైగా వియ్యంకుడు ఎమ్మెల్యే బాలక్రిష్ణ.. అలాంటి దిగ్గజ స్టార్ చెబితే ఏపీలో పనికాకుండా ఉంటుందా..? కానీ బాలయ్య చెప్పినా వినలేదట ఓ మంత్రివర్యులు.. ఏకంగా సినీ డిస్ట్రిబ్యూటర్, రియల్టర్ అయిన ఓ పారిశ్రామివేత్త నుంచి ముక్కుపిండి మూడుకోట్లు వసూలు చేశారట.. విశాఖలో జరిగిన ఈ తతంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

విశాఖకు చెందిన ఓ సినీ డిస్ట్రిబ్యూటర్, రియల్టర్ విశాఖపట్నం శివారు ఆనందపురం మండలం శొంఠ్యాం పరిసరాల్లోని 25 ఎకరాల పంటపొలాల్లో ఓ భారీ వెంచర్ ప్రతిపాదించాడట.. ఇది వ్యవసాయ భూమి కావడంతో వెంచర్ గా మార్చేందుకు నాలాలు, ఇతర సౌకర్యాల ఏర్పాటు అనుమతి కోసం రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు.. నెల గడిచినా ఆ ఫైలు కదిలింది లేదు. చివరకు విసుగు చెందిన రియల్టర్ రెవెన్యూ ఉన్నతాధికారి దగ్గరకుపోయి విషయం కనుక్కున్నాడు. ‘మంత్రి గారిని కలిసి.. ఫార్మాలిటీస్ ఇవ్వకుండా అంత భారీ వెంచర్ ఎలా చేస్తారని’ సదురు అధికారి ఆపేశామని చెప్పడంతో రియల్టర్ ఖంగుతిన్నాడట.. వెంటనే మంత్రిగారి వద్దకు వెళ్లి అడగడంతో 4 కోట్లు ఇస్తే కానీ నీ వెంచర్ కు అనుమతులు రావని ఖరాఖండీగా చెప్పేశాడట.. దీంతో అంత సాధ్యం కాదని కోటి ఇస్తానని రియల్టర్ చెప్పినా మంత్రి వినిపించుకోలేదట.. దీంతో నీ పని కాదు అని మంత్రి వెళ్లగొట్టాడట..

గతంలో బాలక్రిష్ణ సినిమా డిస్ట్రిబ్యూటర్ గా చేసిన సదురు రియల్టర్ ఈ విషయాన్ని బాలయ్యతో చెప్పించాడట..కానీ సదురు మంత్రికి బాలయ్య చెప్పినా పెడచెవిన పెట్టాడట.. పైగా రియల్టర్ ను బెదిరించాడట.. నాకు బాలయ్యతో చెప్పిస్తావా అని ఆగ్రహించాడట.. చేసేదేం లేక చివరకు 4కోట్లు ముట్టజెప్పి ప్రాజెక్టు వెంచర్ కు అనుమతులు తీసుకున్నాడట రియల్టర్.. తెరవెనుక జరిగిన ఈ తతంగం బయటకు రావడంతో ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యే లు సాగిస్తున్న విచ్చలవిడి దందా వెలుగుచూసింది.. స్వయంగా ఏపీ సీఎం వియ్యంకుడు చెప్పినా పనులు జరగని అవినీతి సామ్రాజ్యం ఏపీలో పెనవేసుకుందని అర్థమవుతోంది..

To Top

Send this to a friend