బాలయ్యకు రోటీన్ కథా.. వైరెటీనా.?

కొన్నాళ్లుగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఫాంలో లేరు.. ఆయన గత సినిమాలు లోఫర్, ఇజం అయితే ప్లాపులు అయ్యాయి. మధ్యలో తీసిన టెంపర్ అదీ వక్కంతం వంశీ కథ కావడంతో హిట్ అయ్యింది. అవే మాఫియా.. అదే పరుష డైలాగులు.. అదే డ్రామాలే పూరి జగన్నాథ్ కొంప ముంచుతున్నాయి. మళ్లీ అలాంటి కథలే తీస్తుండడంతో అగ్రహీరోలు పూరి దర్శకత్వంలో నటించేందుకు ముందుకు రావడం లేదు.
బాలక్రిష్ణకు పూరి ఏ కథ వినిపించాడు.. దేనికి బాలయ్య ఇంప్రెస్ అయ్యాడో తెలియదు కానీ ఇప్పుడు ఇది ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది. మహేశ్ కు వినిపించిన జనగణమన కథ అని అందరూ అంటున్నారు . అది సోషల్ మెసేజ్ కథ అని దానికి మహేశ్ ఓకే అన్న ముందుకు రాకపోవడంతో బాలయ్య తో తీద్దామని పూరి డిసైడ్ అయ్యాడని తెలిసింది. బాలయ్య ఎలాగూ పొలిటికల్ గా ఎమ్మెల్యేగా ఉండడంతో ఈ కథ సరిగ్గా సరిపోతుందనే ఈ కథను ఫైనలైజ్ చేశారని సమాచారం. ఒక వేళ రొటీన్ మాస్ కథ ఇస్తాడా లేదా డిఫెరెంట్ గా ట్రై చేస్తాడో చూడాలి. బాలక్రిష్ణ లాంటి అగ్రహీరో సినిమా గ్రాండ్ హిట్ చేస్తే మల్లీ పూరి ఫాంలోకి వచ్చినట్టే..

To Top

Send this to a friend