బాలక్రిష్ణకు బావ చంద్రబాబు షాక్.

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణకు బావ, ఏపీ సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. హిందూపురంలో బాలక్రిష్ణ పీఏ ఆగడాలపై తిరుగుబాటు చేసిన టీడీపీ నాయకులను బాలయ్య పోలీసులతో అణిచివేసిన సంగతి తెలిసిందే.. మరో వైపు బాలయ్య పీఏ బెదిరింపులు, దందాలు, ఆగడాలపై రిపోర్టు తెప్పించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే అతడిని బాలయ్య పీఏగా తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దని, అందరూ ఏకతాటిపై నడవాలని.. రాజకీయాలు చేసిన ఎవ్వరినైనా తీసిపారేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

బాలక్రిష్ణకు ఆయన పీఏ శేఖర్ అవినీతిపై హిందూపురం టీడీపీ నాయకులు ఎంత విన్నవించినా చెవికెక్కించుకోలేదు. నాన్చివేశాడు. దాంతో హిందూ పురం టీడీపీ నాయకులు, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమై శేఖర్ వ్యతిరేకులను ఏకం చేశారు. అతన్ని తొలగించకపోతే రాజీనామా చేస్తామని టీడీపీ అధిష్టానాన్ని బెదిరించారు. అన్నట్టుగానే లేపాక్షి, చిలమత్తూరు మండల జడ్పీటీసీలు రాజీనామాలు చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మరింత మంది టీడీపీకి రాజీనామా చేస్తామని బెదిరించడంతో చంద్రబాబు, లోకేష్ లు స్పందించారు. వెంటనే బాలయ్య పీఏ శేఖర్ ను తొలగిస్తున్నట్టు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇన్నాళ్లు మీనమేషాలు లెక్కించిన బాలయ్యకు ఇది మింగుడు పడని విషయమే..

To Top

Send this to a friend