బాబూ బస్తీమే సవాల్.. హోదా పోరాటంలో జగన్ సైతం..

ప్రత్యేక హోదా అంశంపై ఏపీ ప్రధాన ప్రతిపక్షం స్పందించింది. ప్రత్యేక హోదా పోరాటంలోకి వైసీపీ దిగింది. వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రత్యేక హోదాపై విశాఖలో జరుగుతున్న యువకుల ఆందోళనలో తాను పాల్గొంటానని.. గురువారం సాయంత్రం వైసీపీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా ఆకాంక్షను చాటేందుకు తాను పాల్గొంటానని.. సీఎం చంద్రబాబుకు చిత్త శుద్ది ఉంటే ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం హోదాపై యువకుల ఆందోళనను అణిచివేయాలని చూస్తోందని.. తాను పాల్గొంటానని.. తనను అరెస్ట్ చేస్తారా.. యువకులను అరెస్ట్ చూసి ఉద్యమాన్ని ఆపుతారో చూస్తానని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం విశాఖలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని.. దీనికి ఆటంకాలు కలిగించవద్దని జగన్ ప్రభుత్వాన్ని కోరారు.

ముఖ్యమంత్రి పోలీసులు కలిసి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడం దారుణమని జగన్ మండిపడ్డారు.. చంద్రబాబు పాలన చూస్తుంటే బ్రిటీష్ పాలన గుర్తుకువస్తుందని మండిపడ్డారు. యువతపై పీడీకేసులు పెడుతున్నారని.. ముందు చంద్రబాబుపై టాడా కేసు పట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా కోసం ఏపీ తరఫున ఎవ్వరూ ముందుకొచ్చిన స్వాగతిస్తామని.. అందరం కలిసి ఢిల్లీ వెళ్లి హోదాపై పోరాడుతామని.. చంద్రబాబు కలిసి రావాలని జగన్ పిలుపునిచ్చారు. హోదాకు కేంద్రం ఒప్పుకోకపోతే ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని.. కేంద్రంలోని మంత్రులను ఉపసంహరించుకోవాలని.. ఎన్నికలకు వెళ్లి కేంద్ర ప్రబుత్వానికి బుద్ది చెప్పాలని జగన్ బాబుకు సూచించారు..

విశాఖలో యువత ఏర్పాటు చేసిన ఉద్యమంలో చంద్రబాబు సహకరించినా.. అరెస్ట్ చేసినా తాను ముందుకే వెళతానని జగన్ స్పష్టం చేశారు. జూన్ వరకు హోదాపై తేల్చకపోతే వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని ఆయన వెల్లడించారు.ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసిరాకపోతే చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని.. జగన్ స్పష్టం చేశారు. జల్లికట్టు విషయంలో తమిళనాడు తరహాలో ఏపీ ప్రజలంతా కలిసి ముందుకు రావాలని.. అక్కడి సీఎం చొరవ చూపినట్టు చంద్రబాబు పనిచేయకపోవడం సిగ్గుచేటు అని జగన్ చంద్రబాబును విమర్శించారు.

To Top

Send this to a friend