కడప ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష వైఎస్ జగన్ ఇద్దరూ ఈ ఎన్నికపై దృష్టిసారించి వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. సొంతగడ్డపై గెలువాలన్న పట్టుదలతో జగన్ శిబిరాలను పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి స్వయంగా బాబాయిని దించి జగన్ ఆయన్ను గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికి కౌంటర్ గా జగన్ సొంత ఇలాఖా కడపలో జగన్ ను ఓడించాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీంతో కడప ఎమ్మెల్సీ ఎన్నికలు బాబు , జగన్ ల పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయంగా మారాయి.
జగన్ సొంత గడ్డపై ఓడించి ఆయన మానసిక స్థైర్యాన్ని ఓడించాలని చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్టు సమాచారం. టీడీపీని కడపలో గెలిపించడం వల్ల జగన్ దెబ్బైపోతాడని.. మిగతా చోట్ల కూడా ఆయనకు గెలుపు కష్టమవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ జగన్ మాత్రం తన ఇలాఖాలో బాబాయి వివేకానందరెడ్డిని రంగంలోకి దించి పకడ్బందీగా ముందుకు వెళుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు.. వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులవెందులకే చెందిన రవీంద్రనాథ్ రెడ్డిని బరిలో నిలిపారు. తెలుగు తమ్మిళ్లకు గెలుపు బాధ్యతలను అప్పగించారు. కడపలో పదినియోజకవర్గాల పరిధిలో 50 మండలాలున్నాయి. ఎనిమిది మునిసిపాలిటీలు, కడప కార్పొరేషన్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఓటర్లుగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొత్తం 854 మంది ఓటర్లున్నారు. ఇందిలో 400 ఓట్లకు పైగా వస్తే గెలుపు గ్యారెంటీ.. అయితే ఇందులో 400 మందిని టీడీడీ నాయకులు చంద్రబాబుతో మిలాఖత్ ఏర్పాటు చేయించి రవీంద్రనాథ్ ను గెలిపిస్తే తాయిలాలు ఇస్తామని హామీ ఇప్పించారట.. కానీ వారందరూ ఓట్లు టీడీపీకి వేస్తారా లేదా అన్నది ప్రశ్నర్థకమే.. ఎందుకంటే ప్రేమలు , పగలు ఎక్కువగా ఉండే రాయలసీమలో అభిమానంతో జగన్ కు వాళ్లు ఓటేస్తారా..? లేక బాబుకు, టీడీపీకి పట్టం కడతారా వేచిచూడాల్సిందే..
