బాబు ఫారిన్ టూర్లు, పవన్ ఓదార్పులు, జగన్ సీక్రెట్ బలోపేతాలు

అంతా స్తబ్ధత.. రాజకీయాలు లేవు.. నాయకులు కానరారు.. ఎక్కడ చూసినా నిర్లిప్తత.. మోడీ దయ వల్ల పెద్ద నోట్లు రద్దు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గంగలో కలిపారు. దీంతో అమరావతి కొత్త రాజధాని నిర్మాణం సాగుతున్నా అక్కడ భూ క్రయవిక్రయాలు మొత్తంగా నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్ లో రియల్ భూం అయితే ఢమాల్ అంది.. ఎవ్వరి దగ్గర పెద్దగా డబ్బులేదు.. ఉన్నవాళ్లు వైట్ మనీగా చేసుకొని బయటకు తీయడం లేదు.. సామాన్యులు ఇళ్లు, భూములు కొనే పరిస్థితి లేదు.. రాజకీయ నాయకులకు పెద్దగా సమస్యలే లేవు.. తెలంగాణలో అయితే రాజకీయంగా అసలేమాత్రం చప్పుడు లేదు. కొంతలో కొంత ఏపీలో సీఎం చంద్రబాబు ఫారిన్ టూర్లు, పవన్ కష్టాల యాత్రలు, జగన్ సీక్రెట్ పార్టీ బలోపేతాలు తప్పితే పెద్దగా ఏంలేవు..

అందరిదీ ఒకటే టార్గెట్ .. రాజకీయంగా 2019 ఎన్నికలు అందరికీ జీవన్మరణమే.. పెద్దనోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోవడంతో వచ్చే ఎన్నికల్లో నోట్లు ఖర్చు పెట్టడం గగనమే.. ఏదైనా మనిషిని చూసి..కొంత అభివృద్ధిని చూసి జనం ఓటేయాల్సిందే.. మునపటిలా విచ్చలవిడి డబ్బుల ప్రవాహం ఉండకపోవచ్చు.. అందుకే అనవసరంగా ఎందుకు డబ్బులు ఖర్చుపెట్టుకోవాలని నాయకులు అసలు జనం మధ్యలోకే రావడం లేదు.. పార్టీల్లోకి జంపింగ్ లు, దూకేయడాలు అస్సలే ఉండట్లేదు.. కొద్దిలో కొద్దిగా జగన్ కొంత క్రియాశీలక రాజకీయాలు నడుపుతున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయన పాత కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకొని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అందుకే కేవీపీ, ఉండవల్లి, హర్షకుమార్, డీఎల్ రవీంద్రారెడ్డిలను వైకాపాలోకి ఆహ్వానించడానికి రెడీ అవుతున్నాడట.. అలాగే టీడీపీలోకి వలసపోయిన ఎమ్మెల్యేల స్థానంలో మెరికలను దించి వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం..

To Top

Send this to a friend