బాబు టార్గెట్.. పాపం రోజా.

పాపం రోజా.. అసెంబ్లీలో ఆరోజు జరిగిన గొడవతో ఆమె కలలు కల్లలవుతున్నాయి. సంవత్సరం క్రితం హైదరాబాద్ లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనితను అవమానించేలా అనుచితంగా దూషించారు. ఈ వ్యవహారంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇది అన్యాయమని రోజా హైకోర్టుకు.. అక్కడినుంచి సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడారు. చివరకు సుప్రీంకోర్టు స్పీకర్ కు సూచించింది. సారీ చెబితే అనుమతించమని.. కానీ ఏపీ స్పీకర్ చంద్రబాబు ఆమెకు సడలింపు ఇవ్వలేదు.. వాయిదాలు వేశారు..

చివరకు హైకోర్టు సూచనతో రోజాపై ప్రివిలేజ్ కమిటీ వేశారు. దానికి రోజా సంజాయిషీ ఇచ్చింది.. దీనిపై శనివారం అమరావతిలో సమావేశమైన కమిటీ రోజా ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందలేదని సమాచారం. ఆమె దురుసు ప్రవర్తన, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న తీరుకు నిరసనగా మరో ఏడాది నిషేధం విధించాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించుకున్నట్టు సమాచారం..

దీంతో రోజా కల చెదిరిపోయింది.. ఆమె మొదటిసారి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏడాదిలోనే ఆమె దూకుడుకు ఏపీ ప్రభుత్వం, సీఎం బెంబేలెత్తిపోయారు. నిషేధం విధించారు. దీంతో ఏడాదికే ఆమె అసెంబ్లీ ముచ్చట తీరిపోయింది. ఆమె ప్రజాసమస్యలపై గళమెత్తే అవకాశం లేకుండా పోయింది. మొన్నటికి మొన్న మహిళా పార్లమెంట్ సదస్సుకు ఆహ్వానించి మరీ ఆమెను దారుణంగా అవమానించారు. హైదరాబాద్ వచ్చి చంద్రబాబు తీరుపై రోజా కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో అడుగుపెట్టకుండా మరో ఏడాది నిషేధం విధిస్తున్నారు. ఇలా రోజాను టార్గెట్ చేసి చంద్రబాబు ఆమెను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏ రాజకీయ నేత కూడా అవలంభించని రీతిలో చంద్రబాబు చేస్తున్న ఈ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend