బాబు చిట్టీ.. బీ.కామ్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఏంటి..?

mla-jaleel-khan-tdp-ysrcp

ఐఏఎస్ కు సివిల్స్ రాసి పాసవ్వాలి.. ఎస్సై పరీక్ష కోసం పరుగు పందేల్లో కి.మీలు పరిగెత్తాలి.. డాక్టర్ చదవాలంటే ఎంసెట్ లో రాత్రి పగలు కష్టపడాలి.. కానీ దేశంలో ప్రజాప్రతినిధి కావలంటే మాత్రం అక్షరం ముక్క రాకున్నా ఫర్వాలేదు.. ఇదెక్కడి.. న్యాయం..? ఇదేం దేశం అని రగిలిపోకుండి.. చదువురానివారే రాజ్యాలేలుతున్న పరిస్థితిలో ఉన్నాం.. చదువుకున్న విద్యావంతులు రాజకీయాల్లోకి రాకపోవడం ఒక కారణమైతే.. అవినీతి వ్యవస్థలో అసమర్థులే గద్దెనెక్కడం రివాజుగా మారింది.. అదంతా పక్కనపెడితే..
విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన చదువు గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తానూ బి.కాం చదివానని చెప్పారు. ఇందులో వింతేమీ లేదు కానీ, తాను బి.కాం లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ చదివానని చెప్పారు. బి.కామ్ లో ఆ సబ్జెక్ట్స్ ఉండవు బాబో అని ఆ రిపోర్టర్ చెబుతున్నా, వినిపించుకోకుండా బి.కామ్ లో మ్యాథ్స్ ఉంటుందని జలీల్ ఖాన్ వాదించారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అవడం తో కొంతమంది రిపోర్టర్లు జలీల్ ను అసలు ఏం చదువుకున్నారు మీరు అని అడిగారు. దీనితో జలీల్ తాను ఏం చదివానో గుర్తు లేదని, సర్టిఫికెట్స్ చూసి చెబుతానని తప్పించుకోవడం గమనార్హం.. ఈ ఇంటర్వ్యూ దెబ్బతో జలీల్ పేరు సోషల్ మీడియా లో తెగ పాపులర్ అయిపోయింది. ఆయనపై సెటైర్లు ఎక్కువైపోయాయి.
కాగా 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి గెలిచిన జలీల్ ఖాన్ ప్రస్తుతం తెదేపాలో చేరిపోయారు. తన ఎన్నికల అఫిడవిట్ లో విజయవాడ షాద్ ట్యుటోరియల్ కాలేజి నుంచి మెట్రిక్యులేషన్ 1969 లో పాస్ అయ్యానని చెప్పాడు. మెట్రిక్ అంటే ఇప్పటి టెన్త్ కి సమానం.

జలీల్ ఖాన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend