బాబుతో మీటింగ్.. ఓ అపశకునమా.?

ఈ మధ్య వరుస సంఘటనలు ఆ నమ్మకానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. బాబుతో మీటింగ్ అయితే వాళ్లకు ఏదో జరుగుతుందన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇంతకీ బాబుతో మీటింగ్ అపశకునమా..? ఆయన్ను కలిశాకే కొందరి ప్రాణాలు పోయాయి.. మరికొందరు పదవులు ఊడిపోయాయన్న ప్రత్యర్థుల విమర్శలు నమ్మశక్యమేనా.? అసలు ఏం జరుగుతోంది..?

రెండు రోజుల క్రితం జయసుధ భర్త హఠాన్మరణం.. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనతో ఆయన చనిపోయారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు మరో విషయం వెలుగుచూసింది. వెలగపూడిలో బాబును కలిసిన తర్వాతే జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త వైరల్ అవుతోంది..

ఇక అంతకుముందు కూడా ఇలానే నంద్యాల ఎమ్మెల్యే సీనియర్ నేత భూమా నాగిరెడ్డి కూడా చంద్రబాబును వెలగపూడిలో కలిసిన తర్వాతే గుండెపోటుతో మరణించడం యథాలాపమా..? లేక యాదృశ్చికంగా ఇవన్నీ జరుగుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇక కొద్దిరోజుల క్రితం తమిళనాడు సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం చంద్రబాబును కలిశాక అమ్మ జయలలిత చనిపోవడం.. పన్నీర్ సెల్వం పదవి ఊడిపోవడం జరిగిందట.. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు బాబును వెలగపూడిలో కలిస్తే ఏదో ఉపద్రవం జరుగుతుందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.. ఇలా ముగ్గురు కలిశారు.. ముగ్గురికి ఏదో జరిగిందని ఊదరగొడుతున్నారు..

ఈ ప్రచారం ఎలా ఉన్నా కానీ చంద్రబాబును వాళ్లు కలవడం.. వారికి అపశకునం జరగడం మాత్రం వాస్తవం. కానీ అది బాబు వల్ల కలిగిందా.? లేదా వారి స్వయంకృతాపరాధమా అన్నది విధి వైపరీత్యం.. పాపం ఈ మొత్తం ఎపిసోడ్ లో బాబును బకరాను చేస్తున్నారు..

To Top

Send this to a friend