బాబుకు జలక్.?


కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాల్లో టీడీపీకి సొంతంగా బలం లేదు. అక్కడ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఎక్కవ సంఖ్యలో ఉన్నారు. ఈ జిల్లాల్లో బలం లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ప్రజాప్రతినిధులను హైజాక్ చేసి క్యాంపులకు తరలించి కొనుగోలు నానా విదాలుగా లోబరుచుకునే ప్రయత్నాలు చేశారు. కోట్లు ఖర్చు చేశాడు. అయినా ఇప్పుడు శుక్రవారం జరిగిన ఓటింగ్ లో ఆ ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్ చేశారని తెలిసింది. దీనిపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం క్రాస్ ఓటింగ్ కు సహకరించిన ఆరోపణలపై కొంతమందిపై వేటువేయడం గమనార్హం. దీంతో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది.

ఎన్నికలు, క్యాంపుల విషయంలో చంద్రబాబును మించినోళ్లు లేరు. అలా క్యాంపులు పెట్టే కదా సొంత మామ, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఘనంగా సీఎం పీఠం ఎక్కిన చరిత్ర చంద్రబాబుది.. అలాంటి చంద్రబాబు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో నిర్వహించిన క్యాంపు విఫలమవడం.. క్రాస్ ఓటింగ్ జరగడంపై మండిపడుతున్నారు. బాధ్యతలు అప్పగించిన మంత్రులపై ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

చంద్రబాబులో ఇప్పుడు ఒకటే ఆందోళన. వైసీపీ నాయకులను కొనేసి క్యాంపులకు తరలించి క్రాస్ ఓటింగ్ చేసి బలం లేకున్నా గెలవాలనుకున్న బాబు ఆశలు నెరవేరేలా లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వార్తలు రావడంతో బాబు శిబిరం ఆందోళనలో పడిపోగా.. వైసీపీ, జగన్ సంతోషంలో ఉన్నారు. ఫలితాలు వస్తే కానీ ఎవరిది గెలుపు, ఓటమి అన్నది తెలియదు.. కానీ జగన్ వైసీపీకే గెలుపు అని విశ్లేషకులు చెబుతున్నారు.

To Top

Send this to a friend