బాబుకు ఆ భయం లేకపోతే ఎందుకు కేంద్రాన్ని నిలదీయరు.?

‘‘ప్రత్యేక హోదా కోసం ఇంత మంది యువత, ఏపీ ప్రజలు పోరాడుతుంటే అది చంద్రబాబుకు ఎందుకు కనిపించదు.. ప్రత్యేక హోదాపై బాబు ఎందుకు కేంద్రం దగ్గర మోకరిల్లుతున్నారు.. ఎందుకు ఇలా కాంప్రమైజ్ అయ్యారో ప్రజలకు చెప్పాలని’’ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం 9.30కు హైదరాబాద్ లో మాట్లాడిన పవన్ ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ వైఖరిని ఎండగట్టారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తన సొంత స్వర్ణ భారతి ట్రస్టు పై పెట్టిన శ్రద్ధ ఏపీ ప్రత్యేక హోదాపై పెట్టి ఉంటే ఎప్పుడో వచ్చేదని పవన్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ఒంటెత్తు పోకడ.. బీజేపీ నేతల వైఖరి ప్రజల మనోభావాలకు వ్యతిరేకమని పవన్ మండిపడ్డారు. మీరు దేవుళ్లుకాదు.. ఏం చేసినా భరించలేం..అని బీజేపీ నేతలను విమర్శించారు. బీజేపీ ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిందని.. స్పెషల్ ప్యాకేజీ అర్ధరాత్రి ఇవ్వడంలో ఆంతర్యమేంటి.? కేంద్రం, బీజేపీ తప్పు చేస్తోందా.? అందుకే అర్ధరాత్రి ప్యాకేజీ ఇచ్చారా అని మండిపడ్డారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో బీజేపీ రాజకీయాలు చేస్తోందని.. అందుకే అక్కడి యువత జల్లికట్టుతో బీజేపీకి గట్టి వార్నింగ్ ఇచ్చిందన్నారు. తాను విశాఖలో యువత ఆందోళనలో పాల్గొనలేదని కొందరు విమర్శించారని.. కానీ ప్రభుత్వంపై పోరాడితే సమస్యలు పరిష్కారం కావు అనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు.

చంద్రబాబుకు మద్దతిచ్చింది అందుకే..

చంద్రబాబుకు పరిపాలన అనుభవం ఉందన్న ఒకే ఒక కారణంతో ఆయనకు మద్దతిచ్చాం. కానీ బాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కొసం పొరాడకుండా తప్పు చేస్తున్నారు. హోదా ఇస్తామని ఓట్లు వేయించుకున్న బాబు, బీజేపీ ఇప్పుడు హోదా సంజీవని కాదంటున్నారని’ పవన్ మండిపడ్డారు. హోదాపై ఇచ్చిన మాటను బాబు నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. చంద్రబాబు అవినీతిపరుల పంచన చేరి వారికి సపోర్ట్ ఇస్తున్నారని.. రాయపాటి, సుజనా లాంటి బడా పారిశ్రామికవేత్తల చేతిలో కీలుబొమ్మగా మారాడని విమర్శించారు. అసలు ఏపీలో టీడీపీ పాలనకంటే మినీ బీజేపీ పాలనను తలపిస్తుందని పవన్ విమర్శించారు. అందుకే వారు ఏపీ ప్రత్యే కహోదా ఉద్యమాన్ని పందుల పందేలతో పోల్చిన కంట్రోల్ చేయలేని స్థితిలోకి వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టాడని.. అలాంటి వ్యక్తి హోదాపై మాట్లాడడం.. పందుల పందేలు అంటా మాట్లడడం సిగ్గుచేటు అన్నారు. రాయపాటి, సుజనాలు చేసిన మోసాలపై చంద్రబాబు వెంటనే విచారణ చేయించి నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులతో అణిచివేస్తే.. ప్రాణాలకు తెగిస్తాం..

ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమాలను చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో అణచాలని చూస్తోందని.. అలాంటి పనులు చేస్తే తాను కుటుంబం, పిల్లా పాపలను వదిలేసి ప్రాణాలు తెగించి అయిన హోదా కోసం కొట్లాడుతానని మండిపడ్డారు. ఏపీ యువత కూడా అందుకు సిద్ధంగా ఉందని పవన్ స్పష్టం చేశారు..

To Top

Send this to a friend