బాబీకి ప్రేమతో.. -ఎన్టీఆర్..


తనకు మంచి కథలు, హిట్ లు అందించే దర్శకులకు ఏదో గిఫ్ట్ ఇచ్చి ఎన్టీఆర్ ఆశ్చర్యపరుస్తుంటారు. జనతా గ్యారేజ్ సినిమా హిట్ చేసినందుకు గతంలో తారక్ కొరటాల శివకు ఓ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా తర్వాత చాలా కథలు వింటూ సినిమాను ప్రకటించని ఎన్టీఆర్.. ఇప్పుడు దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) చెప్పిన కథకు ఓకే చెప్పాడు. ఇందులో మూడు వైవిధ్యమైన పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అందులో ఒకటి క్రికెటర్ గా కనిపించబోతుండగా.. రెండు విభిన్నపాత్రలు.. ఇలా తనకు మంచి కథను అందించిన బాబీకి కూడా ఎన్టీఆర్ ఓ ఖరీదైన బహుమానం ఇచ్చాడట..

తారక్ ఏ దేశం వెళ్లినా ఖరీదైన వాచ్ లను కొనడం అలవాటుగా చేసుకున్నాడు. అందులో ఓ 4 లక్షల విలువైన ఖరీదైన వాచ్ ను బాబీకి బహుమతిగా ఇచ్చినట్టు ఫిలింనగర్ టాక్.. ఎన్టీఆర్ గిఫ్ట్ ఇవ్వడంతో బాబీ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నట్టు చెబుతున్నారు.

To Top

Send this to a friend