బాప్ రే జియో.. ఎంతో ఫాస్ట్


జియో.. జియో.. టెలికాం రంగంలో విప్లవాత్మక చర్యలకు నాంది పలికిన జియో మరో సంచలనాన్ని తీసుకువచ్చేందుకు నిర్ణయించడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.. ఇప్పటికే దేశంలో జియో 4జీ సేవలు ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించలేదు.. ఇప్పుడిప్పుడే జనాలు కనెక్ట్ అవుతున్నారు. కానీ జియో మాత్రం వేగంగా ముందుకు వెళుతోంది.. స్పెయిన్ లోని బార్సిలోనియాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో జియో అధికారికంగా 5జీ సేవలను త్వరలోనే ఇండియాలో ప్రారంభిస్తామని ప్రకటించి సంచలనం సృష్టించింది.. 5జీ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు రిలయన్స్ జియో టెక్నాలజీ దిగ్గజం సామ్ సంగ్ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది.

ఈ సదస్సులో భాగంగా దక్షిణా కొరియా కంపెనీతో జియో తయారు చేయించిన 5జీ హోమ్ రూటర్, 5జీ రేడియో బేస్ స్టేషన్, 5జీ మోడప్ చిప్ సెట్ లను ప్రదర్శించింది. సామ్సంగ్ కంపెనీ కూడా తన కొత్త 5జీ ఉత్పత్తులను మీట్ లో ఆవిష్కరించింది. అక్కడే జియో సామ్ సంగ్ భాగస్వామ్యం ఒప్పందం కుదిరినట్టు ప్రకటించారు. దీంతో త్వరలోనే భారత్ లో కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మొదట జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రజలకు ఈ సేవలు రావడానికి ఇంకా టైం పడుతుంది.

To Top

Send this to a friend