బాప్ రే ఎన్టీఆర్ సినిమాకు 85 కోట్లా..?


జనతా గ్యారేజ్ సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరిన ఎన్టీఆర్ కు భలే డిమాండ్ ఏర్పడింది.. ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలు కాకముందే ఈ సినిమాను కొనడానికి ఓ భారీ నిర్మాత ముందుకొచ్చినట్టు సమాచారం. టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరైన ఆయన ఈ సినిమాను 85 కోట్లకు కొనేందుకు ముందుకువచ్చారట.. ఎన్టీఆర్ సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్ ను దీనిపై సంప్రదించినట్టు తెలిసింది.. కావాలంటే ఓ 5 కోట్లు ఎక్కువగా ఇస్తానని తనకే అమ్మాలని కళ్యాణ్ రామ్ పై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది..

కాగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో విలన్ పాత్రను కూడా ఎన్టీఆరే చేయనుండడంతో ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. మరో పాత్రలో క్రికెటర్ గా నటిస్తున్నారు. కథ పరంగా ఎక్స్ లెంట్ అని తేలడంతో ఈ సినిమాను కొనేందుకు అగ్రనిర్మాతలు కళ్యాన్ రామ్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.. కానీ ఏ విషయాన్ని కళ్యాన్ రామ్-ఎన్టీఆర్ ఇప్పుడే చెప్పలేం అంటున్నారట.. అయితే ఏరోస్ వంటి ఇంటర్నేషనల్ సంస్థలు తెలుగు సినిమాలను గంపగుత్తకొని భారీ రేట్లు చెల్లించి సొంతం చేసుకుంటున్నాయి. అలా వాళ్లకు దక్కనీయకుండా ఉండాలనే ఆ నిర్మాత ఎన్టీఆర్ సినిమా ఈ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది..

To Top

Send this to a friend