బహిరంగ కామక్రీడలకు కార్పొరేషన్ వేదిక..


అదో కార్పొరేషన్.. ప్రజలందరూ వచ్చే వేదిక.. సమస్యలు చెప్పుకునేది అక్కడే.. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు తమ కామవాంఛను తీర్చుకునేందుకు కార్పొరేషన్ ను వేదికగా ఎంచుకున్నారు. ఏసీలు పెట్టుకొని ఏకంగా కమిషనర్ గదిలోని యాంటీరూంను రాసక్రీడలకు అనువుగా మార్చుకున్నారు. రూ.200, క్వార్టర్ ఇచ్చి ఏర్పాట్లు చేసుకున్నారు. పై అధికారులు కింది స్థాయి మహిళా ఉద్యోగినులతో రోజూ రాసలీలలు జరపడం కడప కార్పొరేషన్ లో నిత్యకృత్యంగా మారాయి. దీనిపై ఆనోట ఈనోట బయటకు పొక్కడంతో అంతా విస్మయం కలుగుతోంది..

కడప కార్పొరేషన్ ఇటీవలే మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయ్యింది. అధికారులు నిధులు వెచ్చించి సౌకర్యాలు కల్పించారు. అదికారుల కోసం సపరేట్ క్యాబిన్లు, ఏసీలు ఏర్పాటు చేయించారు. ఏసీ చల్లదనం పోకుండా డోర్లు పెట్టి లోపలే పనులు చేసుకుంటున్నారు. దీంతో బయటవారికి లోపల ఏం జరుగుతుందో తెలియదు.. దీన్ని అవకాశంగా తీసుకొని కార్పొరేషన్ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు చాంబర్లలో.. రెండో అంతస్తులోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక చాంబర్ లో ఇద్దరు అధికారులు, ఒక జూనియర్ అసిస్టెంట్ రాసక్రీడలను సాగిస్తున్నట్టు అక్కడి ఉద్యోగులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. కింది స్థాయి మహిళా ఉద్యోగులను లోబరుచుకొని వీరు సెక్స్ చేస్తున్నట్టు తేలింది. ఏదైనా పనిమీద వారి కార్యాలయాలు వెళితే వారు చేసే రాసలీలలు చూడలేక ఉద్యోగులు వెనక్కి వచ్చేస్తున్నారట.. అంతేకాదు కమిషనర్ పనిమీద హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళితే ఆయన గదిని రాసలీలలకు వాడుతూ తమ పైత్యం ప్రదర్శిస్తున్నారట ఆ కామాంధులు.. ఈ పరిణామాలు పక్కనే పనిచేస్తున్న ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారడంతో విషయం వెలుగుచూసింది. వారిపై చర్యలు తీసుకోవాలని.. ఉద్యోగాల నుంచి తొలగించాలని కార్పొరేషన్ సిబ్బంది కోరుతున్నారు.

To Top

Send this to a friend