జనసేనాని రంగంలోకి దిగారు.. 2014 ఎన్నికల్లో మిత్రపక్షంగా ఏర్పడి టీడీపీ,బీజేపీతో జట్టుకట్టి ఏపీలో టీడీపీని అధికారంలో తీసుకొచ్చిన పవన్.. అనక టీడీపీ-బీజేపీ పాలనపై అసంతృప్తితో ప్రజల పక్షం చేరాడు.. ప్రస్తుతం టీడీపీ పాలనపై పోరాడుతున్నాడు. నెలకో టాపిక్ తీసుకొని ప్రభుత్వాన్ని కడిగిపారేస్తున్నాడు.
మరోవైపు పక్కలో బల్లెంలా జగన్ కాచుకూర్చున్నాడు.. ఇటు పవన్ రంగంలోకి దిగడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు.. గడిచిన 2014 ఎన్నికల్లో అందరూ జగన్ గెలుస్తారని అనుకున్నారు. ఒకదశలో బీజేపీతో పొత్తుపెట్టుకుందామని వైసీపీ అనుకున్నా.. అహంభావంతో గెలుస్తామన్న దీమాతో జగన్ పక్కకు పెట్టారు. అదే కలిసివచ్చి టీడీపీ గెలుపునకు దోహదపడింది. 2014ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారు అనేకన్నా జగన్ ఏకపక్ష నిర్ణయాలతో స్వయంకృతాపరాధాలతో ఓడారంటేనే కరెక్ట్..
ఇక 2019 ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయి. హోదా ఇవ్వని బీజేపీకి కాంగ్రెస్ గతిపట్టడం ఖాయంగా తోస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక వైసీపీ కూడా బలంగా అధికారం కోసం పోరాడుతోంది. మధ్యలో వచ్చిన పవన్ ఓట్లను చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ పోరాడుతోంది ప్రజాసమస్యలపై కనుక.. అది అధికార పార్టీకే ముప్పుగా తోస్తోంది. పవన్ ప్రభుత్వంపై పోరాటంతో టీడీపీ ఓట్లే చీలిపోనున్నాయి. కొన్ని టీడీపీ ఓట్లు జనసేన పార్టీకి పడితే అంతిమంగా అది జగన్ కే మేలు చేయనుంది. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్ పై ఏ ఒక్క వైసీపీ లీడర్ కూడా విమర్శలు గుప్పించట్లేదు.. పవన్ తో వైసీపీకి లాభం కనుకే ఆ నాయకులు మిన్నకుండిపోతున్నారు.. అంతిమంగా పవన్ ఏపీ రాజకీయ ప్రవేశం టీడీపీకి దెబ్బగాను.. వైసీపీ లాభంగాను మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. అయితే పవన్ కనుక పార్టి నిర్మాణం చేసి గ్రామ స్థాయికి వెల్లగలిగితే అతనికి కుడా ఆవకాశం ఉంది.
