బయటపడ్డ జేసీ అల్లుడి బండారం.

అనంతపురం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన జేసీ ప్రభాకర్‌ రెడ్డి అల్లుడు దీపక్‌ రెడ్డికి షాక్‌ తగిలింది. దీపక్ రెడ్డి చేసిన మోసాన్ని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ధృవీకరించారు. భూ కబ్జా కేసులో ఆయన్ను ఏ-5గా చేర్చారు. ఇదే కాదు దీపక్‌ రెడ్డికి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్‌లో ఆయూబ్ కమల్ అనే వ్యక్తి తన మూడు ఎకరాలు 37సెంట్ల భూమిని గతంలో ఎంవీఎస్ చౌదరి అనే వ్యక్తికి 1960లోనే విక్రయించారు. అయితే జై హనుమాన్ ట్రేడర్స్ యాజమానితో పాటు దీపక్ రెడ్డి కలిసి ఆ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించారు.

ఆ భూమిని ఆయూబ్ కమల్ తొలుత తమకే విక్రయించారంటూ కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎంవీఎస్‌ చౌదరి తరపు న్యాయవాదులు అసలు పత్రాలను కోర్టు ముందు ఉంచారు. దీంతో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. జై హనుమాన్‌ ట్రేడర్స్ , దీపక్‌ రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించినట్టు తేల్చారు. దీంతో జైహనుమాన్ ట్రేడర్స్ యజమాని కుమారుడు సక్సేనా, దీపక్‌ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధ‌మైంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్‌ రెడ్డిపై ఇంకా అనేక భూకబ్జా కేసులు కూడా ఉన్నాయి. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు దీపక్‌ రెడ్డి ఏకంగా తన ఆస్తుల విలువను 6,781 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లోనే చూపించారు. అన్ని వేల కోట్ల ఆస్తుల్లో చాలా భూములు వివాదాల్లో ఉన్నవే.

To Top

Send this to a friend