బన్నీ-మెగాస్టార్ కలిసి ..


చిరంజీవితో కలిసి సినిమా చేయాలని అల్లు అర్జున్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చిరు లాంటి మెగాస్టార్ ను సినిమా లో చూపించాలం టే మంచి పాత్ర కావాలి. దీంతో ఆ పాత్ర దొరక్క అల్లుడి సినిమాలో మెగాస్టార్ నటించలేదు. కానీ ఇప్పటికీ వీలైంది.
వక్కంతం వంశీ వినిపించిన ఓ కథ అల్లు అర్జున్ తెగ నచ్చేసింది. అందులో నటించడానికి బన్నీ ఓకే చెప్పాడు. ప్రస్తుతం చేస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా పూర్తి కాగానే వక్కంతం సినిమా సెట్స్ పైకి వెళుతుంది. మేనెలలో దువ్వాడ జగన్నాథమ్ విడుదల అయ్యాక వక్కంతం సినిమా మొదలవుతుంది.

అయితే ఇందులో ఓ కత్తి లాంటి పాత్రకు చిరంజీవి అయితేనే సూట్ అవుతారని భావించి బన్నీ చిరును సంప్రదించారట.. కొద్దిసేపు అలా వచ్చి కీలకంగా మారే పాత్రలో చిరునే నటింపచేయాలని పట్టుదలగా ఉన్నారట.. చిరు దీనికి ఓకే చెప్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

రేసుగుర్రం లాంటి మాంచి కిక్ ఉన్న కథను అందించిన వక్కంతం తొలిసారి దర్శకత్వం చేయనుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. వంశీ ఇదే కథను మొదట ఎన్టీఆర్ కు చెబితే ఆయనకు నచ్చకపోవడంతో వదిలేశారు. బన్నీ దీన్ని చేయడానికి ఒప్పుకున్నాడు.. ఈ సినిమాకు ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

To Top

Send this to a friend