బడ్జెట్ లో బీజేపీ మార్క్..

గడిచిన 65 ఏళ్లు గా భారతదేశంలో ప్రవేశపెడుతున్న అన్ని బడ్జెట్లకు ఢిపరెంట్ గా బీజేపీ ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు లో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.. ఇన్నేళ్లుగా కొనసాగుతున్న బడ్జెట్ రూపును మొత్తంగా మార్చారు. రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టడాన్ని బీజేపీ తొలగించింది.. సాధారణ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను కలిపేసి సంప్రదాయాలను బీజేపీ సంస్కరించింది.. దీంతో దేశంలో ఇక నుంచి రైల్వే బడ్జెట్ విడిగా ఉండదు.. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులుండవు.. 92 ఏళ్ల బడ్జెట్ సంప్రదాయంలో ఇది విప్లవాత్మక చర్య.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలో ఈరోజు పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టారు. పెద్దనోట్ల రద్దుతో కుదేలయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పట్టడమే ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన సాగింది.. రెండెంకల ద్రవ్యోల్బణం అదుపులోకి రావడానికి బడ్జెట్ దోహదపడుతుందన్నారు. వివక్షాపూరిత విధానాలకు పూర్తిగా ముగింపు పలికామని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.

బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పది అంశాలకు పెద్ద పీట వేసిందన్నారు. ముఖ్యంగా రైతులు, గ్రామీణాభివృద్ధి, యువత, పేదల ఆరోగ్యం, మౌళిక సదుపాయాల కల్పన, పారిశ్రామికవృద్ధికి ఆర్థిక చేయూత, వేగవంతమైన జవాబుదారీతనం, ప్రజా సర్వీసులు, సమర్థవంతమైన ఆర్థిక విధానం, నిజాయితీ పరులకు సరళీకృతమైన పన్ను లాంటి వాటికి బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించారు. మొత్తంగా గొప్పలకు పోకుండా పేదలకు మధ్యతరగతి వారికి చేయూతనిచ్చేందుకు రూపకల్పన చేసిన బడ్జెట్ లో బీజేపీ మార్క్ కనపడింది.

To Top

Send this to a friend