బంగ్లా బెబ్బులి పిల్లిలా మారిపోయింది!

మొన్నటివరకు వన్డే, టీట్వంటీల్లో ప్రదర్శన చూసి బంగ్లా జట్టు భలే ఆడుతోందే అని అనుకున్నాం.. ఇంటా బయటా కూడా బంగ్లాదేశ్ జట్టు క్రికెట్ లో దిగ్గజ క్రికెట్ టీంలను గతంలో ఓడించింది. దానికి అందరం నెవ్వరపోయాం.. అందుకే హైదరాబాద్ లో బంగ్లాదేశ్ తో టెస్ట్ అనగానే అందరూ తక్కువ అంచనా వేయలేదు.. మేటి బౌలర్లున్న బంగ్లాను తట్టుకొని నిలవడం కొంచెం ఇబ్బందే అనుకున్నారు. టస్కిన్, సౌమ్యసర్కార్, షకిబ్ అల్ హసన్, హబ్బీర్ రహమాన్ లాంటి మంచి నాణ్యమైన బౌలర్లున్న బంగ్లాను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తక్కువగా అంచనా వేయలేదు. కానీ ఒక్కరోజులోనే తేలిపోయింది.. బంగ్లాదేశ్.. ప్రపంచనంబర్ 1 ర్యాంకర్ ఇండియా ముందు దిగదుడుపేనని అర్థమైంది.. నయా సారథి కోహ్లీ బ్యాటింగ్ స్టామినా ముందు బంగ్లాదేశ్ తేలిపోయింది..

ఎంత మార్పు.. బంగ్లాదేశ్ పై మనోళ్లు ఇంత చిత్తుచిత్తుగా ఆడుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకుంటే బంగ్లా బౌలింగ్ బలంగా ఉంటుంది. ఆస్ట్రేలియానే వారు ప్యాక్ చేసిన సందర్భాలున్నాయి. న్యూజిలాండ్ ను చిత్తు చేశారు. దీంతో బంగ్లాపై మంచి టీంతోనే బరిలోకి దిగింది టీమ్ ఇండియా.. అటు ఇటు అయితే పోయిన ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ లపై విజయాలకు మరక అంటుకుంటుదని భావించి కోహ్లీ రెచ్చిపోయారు. కోహ్లీతో పాటు విజయ్ 108 కూడా సెంచరీ చేయడంతో బంగ్లాతో తొలిటెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. తొలిరోజు 90 ఓవర్లలో భారత్ 356 పరుగులు సాధించింది. బంగ్లా బౌలర్లను కోహ్లీ, విజయ్ , పూజారా (83) ఆడుకుంటున్నారు. దీంతో బంగ్లా బెబ్బులి కాస్తా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పిల్లిలా మారిపోయింది..

To Top

Send this to a friend