ఫోటోటాక్‌: టూమ‌చ్‌గా `శ్రుతి` మించింది!

red-hot-pictures-shruti-haasan-braces-the-cover-page-of-gq-magazine-04-1462357696అందాల శ్రుతిహాస‌న్ ఈ రేంజులో రెచ్చిపోతుంద‌ని ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా? .. కానీ రెచ్చిపోయిన మాట నిజం. `డీ- డే` లాంటి క్లాసిక్ హిట్‌లో న‌టించినా, `గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్‌` లాంటి సినిమాతో బంప‌ర్ హిట్ కొట్టేసినా .. అప్ప‌ట్లో చేయ‌నిది ఇప్పుడు చేసి చూపించింది. బికినీనే కొట్టే బికినీతో అదిరిపోయే ఫోజులిచ్చింది. ప్ర‌ఖ్యాత `జీక్యూ` మ్యాగ‌జైన్ కోసం ఇచ్చిన ఫోజు ఇది. అయితే ఇదంతా బాలీవుడ్‌లో స్టార్‌డ‌మ్ కోసం..!
స్కిన్నీ స్ట‌యిల్‌లో క‌నిపిస్తున్న ఈ డిజైన‌ర్ వేర్‌ని ఏమ‌ని పిల‌వాలో తెలీదు కానీ.. శ్రుతి శ‌రీర భాష‌కు స‌రిగ్గా స‌రిపోయింది. ఇటీవ‌లి కాలంలో కాస్తంత ఒళ్లు చేసి బొద్దుగా కూడా మారింది శ్రుతి. అందుకే ఈ డిజైన్ త‌న‌కి యాప్ట్ అయ్యింది. న‌డువొంపుల్ని ప‌ట్టీల‌తో బిగించేసిన ఈ డ్రెస్ శ్రుతిలో హాట్ అప్పీల్‌ని డ‌బుల్ చేసింది. మ‌రీ ఈ రేంజులో రెచ్చిపోయింది కాబ‌ట్టి ఇక బాలీవుడ్‌లో నంబ‌ర్ -1 కిరీటం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌నే అనిపిస్తోంది. అందుకే ఈ ఎత్తుగ‌డ‌ అనుకోవాలి. ప్ర‌స్తుతం శ్రుతి మూడు భాష‌ల్లో మూడు సినిమాలు చేస్తోంది. యారా (హిందీ), ఎస్ 3 (త‌మిళ్‌), ప్రేమ‌మ్ (తెలుగు) .. ఈ సినిమాల‌న్నీ త్వ‌ర‌లోనే రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.

To Top

Send this to a friend