ఫైర్ బ్రాండ్ రేవంత్ ను చెడుగుడు ఆడుతున్న కేసీఆర్

revanth_reddy_kcr-apnewsonline

తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి ఈరోజు ఏడ్వడం ఒక్కటే తక్కువ.. అంతలా ఈ ఫైర్ బ్రాండ్ బాధపడిపోతున్నాడు.. మీడియాతో విలేకరుల సమావేశానికి వచ్చినప్పుడు అక్కడే ఉన్న మంత్రి తలసానితో ఆవేదన వ్యక్తం చేశాడట.. పది గంటలకు ఠంచనుగా శాసనసభ సమావేశాలకు వస్తున్నామని.. కానీ సీఎం కేసీఆర్ 12 గంటలకు సూటు బూటుతో వచ్చి అందరిని డామినేట్ చేస్తూ ఎవ్వరినీ మాట్లాడనీయకుండా వన్ మ్యాన్ ఆర్మీ షో చేస్తున్నాడని రేవంత్ వాపోయాడు. ‘ అన్నా మాకూ జర మాట్లాడే అవకాశం ఇప్పటించు’ అని రేవంత్ మంత్రి తలసానితో ప్రాధేయపడగా తలసాని నవ్వి ఊరుకున్నారు..
అనంతరం శాసనసభ టీడీపీ ఆఫీసులోకి వచ్చిన బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తో సీఎం ఏకపక్షంగా మనకు మాట్లాడనివ్వడం లేదని అనగా వారు అది కరెక్టే నని ఏకీభవించారట.. ఇలా రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ నే అసెంబ్లీలో ముప్పుతిప్పలు పెడుతున్న కేసీఆర్ ఓ రకంగా టీడీపీని ఇతర ప్రతిపక్షాలను చెడుగుడు ఆడుతున్నాడు..

To Top

Send this to a friend