ఫేస్ బుక్ లో భర్త గురించి


జయసుధ తన భర్త దూరమైన విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా ఫేస్ బుక్ వేదికగా చెప్పిన విషయాలు అందరినీ కంటతడిపెట్టించాయి. ఈ మధ్యనే జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలో మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. దీంతో జయసుధ ముంబై వెళ్లి ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. అనంతరం ఈరోజు ఫేస్ బుక్లో తన భర్తతో జీవితంలో పంచుకున్న మధురానుభూతుల్ని, తమ పెళ్లి రోజు సందర్భంగా గుర్తుచేసుకున్నారు..

జయసుధ ఫేస్ బుక్ లో ‘మార్చి 17న అంటే ఇదే రోజు మా పెళ్లిరోజు.. సరిగ్గా 32 ఏళ్ల క్రితం మేమిద్దరం వైవాహిక బందంతో ఒక్కటైన రోజు.. ఆయన లేని లోటు తన జీవితంలో ఎప్పటికీ అలాగే ఉంటుంది. డిప్రెషన్ చాలా బాధకరమైన విషయం. డిప్రెషన్ లోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. చివరకు ఆయన కోరుకున్న శాంతి ఆయన మరణించాక పైలోకంలో ఆయనకు దొరికింది..’ అంటూ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ‘నా భర్త ఎక్కడున్నా, మమ్మల్ని కాపాడుతుంటారు.. ఈ విషయంలో మీడియా సంచలనాలకు పోకుండా వ్యవహరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ’ అటూ జయసుధ సోషల్ మీడియాలో పేర్కొంది..

ప్రస్తుతం జయసుధ కుటుంబానికి ఆమె ప్రధాన ఆదాయ వనరు. జయసుధ భర్త కొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకొని తీవ్రంగా నష్టపోయారు. దీంతో జయసుధే సినిమాల్లో నటిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరి కొడుకును కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఓ వైపు అప్పులు, కుటుంబ భారంతో జయసుధ నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను కుటుంబానికి భారం అని  జయసుధ భర్త నితిన్ కపూర్ డిప్రెషన్ లోకి వెళ్లాడు. ముంబైలో చికిత్స పొందుతూ అపార్ట్ మెంట్ నుంచి దూకి ఉసురు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జయసుధ తన భర్త మరణంపై ఫేస్ బుక్ లో రాసుకొచ్చిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి.

To Top

Send this to a friend