ఫేస్ బుక్: ఎవ్వరు పడితే వాళ్లు ఓపెన్ చేయడానికి లేదు.

ఫేస్ బుక్ సమూల మార్పులు తీసుకొచ్చింది. వినియోగదారుల భద్రతే ప్రమాణికంగా సరికొత్త ఫీచర్లను జోడించింది. ఈ మధ్య సెలబ్రెటీలు, సామాన్యుల ఫేస్ బుక్ ఖాతాలు తరుచుగా హ్యాకింగ్ కు గురి అవుతుండడం చూస్తున్నాం.. దీంతో ఫేస్ బుక్ కు దీనిపై తీవ్ర ఒత్తిడులు వచ్చాయి. దీంతో సాంకేతికంగా భద్రత ప్రమాణాలను ఆధునీకరించి ఫేస్ బుక్ కోడింగ్ సిస్టంను అందుబాటులోకి తీసుకొచ్చింది.. దీనిద్వారా ఫేస్ బుక్ యూజర్లకు పూర్తి భద్రత దక్కుతుంది.

ఇకపై ఫేస్ బుక్ వినియోగదారులు తాము రెగ్యులర్ గా వినియోగించే ఫోన్, కంప్యూటర్ నుంచి కాకుండా వేరే చోట నుంచి ఫేస్ బుక్ ఖాతా ఓపెన్ చేస్తే ప్రత్యేక భద్రత కోడ్ ను ఎంటర్ చేయాల్సిందే.. వినియోగదారుల ఫోన్ నంబర్ కు ఆ భద్రత కోడ్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే ఫేస్ బుక్ ఓపెన్ అవుతుంది. లేదంటే ఖాతా ఓపెన్ చేయడం సాధ్యం కాదు.. కొత్త బ్రౌజర్ లో ఓపెన్ చేయాలన్నా.. ముందులో అందులో పేరు నమోదు చేసుకోవాలి.. తర్వాత ఈ భద్రత కోడ్ వస్తుంది.. కోడ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది.

కాగా ఫేస్ బుక్, ట్విట్టర్ లపై అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహితులు, బంధువులు, అందరితో కలిసిపోవడం.. సాన్నిహిత్యంగా ఉండేందుకు ఫేస్ బుక్ ను అందరూ ఉపయోగిస్తున్నారని.. అదే ట్విట్టర్ ను మాత్రం జ్ఞానం పెంచుకునేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. అంటే ఫేస్ బుక్ కనెక్టవిటీకి, ట్విట్టర్ ఓన్లీ ఇన్ఫర్ మేషన్ కు అన్న మాట.

To Top

Send this to a friend