ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న “ఉందా.. లేదా ..”?

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌  దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్  మూవీ  ‘ఉందా..లేదా?’.ఇటీవల షూటింగ్ ప్రారంభించిన  ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ..
దర్శకుడు అమనిగంటి వెంకట శివప్రసాద్‌ మాట్లాడుతూ : సస్పెన్స్ థ్రిల్లర్ జోన‌ర్‌లో రూపోందుతున్న ఈచిత్రం సక్సెస్ ఫుల్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది అన్నారు..ఈ షెడ్యూల్ లో  కామెడీ సన్నివేశాలను ,చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు..రెండో షెడ్యూల్ ను రంజాన్  తర్వాత  హైద్రాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోనున్నట్లు  తెలిపారు..
నిర్మాత అయితం ఎస్.కమల్ మాట్లాడుతూ : ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశామన్నారు..సీనియర్ ఆర్టిస్ట్ లు బాగా సపోర్ట్ చేశారు..అనుకున్న దానికంటే బాగా వచ్చిందని..ఈ సినిమాను కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నామని  తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె బంగారి, మ్యూజిక్: శ్రీమురళి, కొరియోగ్రాఫర్: నందు జెన్నా, విఎఫ్ఎక్స్: మణికాంత్ -సాగర్, నిర్మాత :అయితం ఎస్.కమల్,కథ-దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్

To Top

Send this to a friend