ప్ర‌పంచ వ్యాప్తంగా `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ట్రైల‌ర్

gpsk-newposter

ప్ర‌పంచ సినిమా చ‌రిత్రలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ట్రైల‌ర్‌ను 100 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ సినిమా ప్రీ లుక్‌, ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ ఏకంగా మూడు మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను భారీగా, విన్నూత‌నంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేశారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కోటిలింగాలలో ట్రైల‌ర్ విడుద‌ల‌వుతుంది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి బాల‌కృష్ణ న‌టించిన వందో చిత్రం కావ‌డం, ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొంద‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సంద‌ర్భంగా
నిర్మాత‌లు వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు మాట్లాడుతూ – “గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో డిసెంబ‌ర్ 16న‌ విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్ప‌డానికి చాలా ఆనందంగా ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్ స‌హా టోటల్ టీం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్నారు. కోటిలింగాల ప్రాంతంలోని కోటేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హిస్తారు. తర్వాత క‌రీంన‌గ‌ర్‌లోని తిరుమ‌ల థియేట‌ర్‌కు వెళ్లి సాయంత్రం ఐదు గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రిస్తారు. సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మాకు అండ‌గా నిల‌బ‌డ్డ ఫ్యాన్స్‌కు థాంక్స్‌. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుదల చేయ‌బోయే వంద థియేట‌ర్స్ లిస్ట్‌ను అభిమానుల‌కు ముందుగానే తెలియ‌జేస్తాం. వంద థియేట‌ర్స్‌, వంద ముఖ్య అతిథులు, అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల కానున్న ట్రైల‌ర్ మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా ట్రైల‌ర్‌కు ఇంత గ్రాండ్‌గా విడుద‌ల కాలేదు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కోసం బాల‌కృష్ణ‌గారు చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. ఆయ‌న త‌ప్ప మ‌రెవ‌రూ ఇంత రాయ‌ల్ లుక్‌లో ఈ పాత్ర‌ను చేయ‌లేర‌నేలా పాత్ర‌లో ఆయ‌న ఒదిగిపోయారు. బాల‌కృష్ణ‌గారి ఎంక‌రేజ్‌మెంట్ లేకుంటే సినిమా ఇంత బాగా వ‌చ్చుండేది కాదు. ద‌ర్శ‌కుడు క్రిష్ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డి చాలా త‌క్కువ రోజుల్లోనే ఇంత భారీ బ‌డ్జెట్‌, హైటెక్నిక‌ల్ మూవీని రూపొందించారు. ప్ర‌స్తుతం వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శకు చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌కాపీ సిద్ధ‌మవుతుంది. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల తేదీని తెలియ‌జేస్తాం“ అన్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

To Top

Send this to a friend