ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్టార్‌ నూతన కార్యవర్గం

6R3B9357

ఫిల్మ్‌ఛాంబర్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్టార్‌ ప్రస్తుత ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ మరియు ఆఫీస్‌ బ్యారర్ల మీద అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఛాంబర్‌ ఓ కమిటీని నియమించింది. కమిటీ మెంబర్స్‌గా విజయేంద్ర రెడ్డి, బసిరెడ్డిలు నియమించబడ్డారు. 20 మంది సభ్యులున్న ఈ సెక్టార్‌లో 14 మంది సభ్యులు ఈ రోజు (జూలై 19) హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. దీంతో కమిటీ పాత బాడీని రద్దు చేసి, కొత్త కమిటీ కోసం ఎలక్షన్స్‌ నిర్వహించగా..పి సత్యారెడ్డి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా శంకర్‌గౌడ్‌, వల్లూరిపల్లి రమేష్‌లు ఎన్నికయ్యారు. సెక్రటరీగా శ్రీ పద్మిణి, పూసల కిషోర్‌ ఎన్నిక కాబడ్డారు. ఈ నెల 22 వతేదీ జరిగే ఈ.సి. మీటింగ్‌లో అఫిషియల్‌గా కమిటీకి అమోదం లభిస్తుందని ఎలక్షన్‌ అబ్జర్వర్స్‌ విజయేంద్రరెడ్డి, బసిరెడ్డిలు తెలియజేశారు.

To Top

Send this to a friend