ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే


మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఫిదా’. ఇప్పటి వరకు ఒక జోనర్‌ సినిమాలకే పరిమితం అయిన శేఖర్‌ కమ్ముల మొదటి సారి తన జోనర్‌ను దాటి బయటకు వచ్చి ఒక మాస్‌ మసాలా సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుండి కూడా ‘ఫిదా’ చిత్రం ప్రేక్షకులను ఊరిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలై అంచనాలను మరింతగా పెంచేసింది.

మంచి సబ్జెక్ట్‌ అయితేనే దిల్‌రాజు నిర్మించేందుకు ముందుకు వస్తాడు. దిల్‌రాజు సినిమా అంటే స్టఫ్ ఖచ్చితంగా ఉంటుంది. అన్నట్లుగానే ఈ సినిమాలో మంచి సబ్జెక్ట్‌ ఉన్నట్లుగా టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. మాస్‌ అమ్మాయి, క్లాస్‌ అబ్బాయిల మద్య ప్రేమ కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఈనెలలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా జులై లేదా ఆగస్టులో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

‘మిస్టర్‌’ చిత్రంతో ప్రేక్షకులను నిరాశ పర్చిన వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాతో సక్సెస్‌ను దక్కించుకుంటాడు అనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఫిదా చేయడం గ్యారెంటీ అంటున్నారు. వరుణ్‌ తేజ్‌కు జోడీగా నటించిన సాయి పల్లవి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకం కుగుతుంది. టీజర్‌లోనే సినిమాను చూపించిన శేఖర్‌ కమ్ముల మొదటి సారి చేసిన ఈ మాస్‌ ప్రయత్నం సక్సెస్‌ కావడం గ్యారెంటీ అనిపిస్తుంది.

To Top

Send this to a friend