ప్రియాంక హాలీవుడ్ హంగామా

2ca7543d-9f07-48f7-ade5-7aecc8e9b05eబాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రాకు హాలీవుడ్ మీద ప్రేమ ఎక్కువైందా? రీసెంట్‌గా ఆమె చేస్తున్న ప‌నులు చూస్తుంటే అలానే ఉంది. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా హాట్ హాట్ పోజులిస్తూ ఎట్రాక్ట్ చేస్తోంది.

`క్వాంటికో` టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక మంచి పేరే తెచ్చుకుంది. ఎక్క‌డ చూసినా ప్రియాంక పోస్ట‌ర్లు, ఏ టీవీ చూసినా ఆమె ఇంట‌ర్వ్యూలే. ఆ మేనియాతోనే `బేవాచ్‌`లో అవ‌కాశం కొట్టేసింది. ఆ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది. ఇలా ఎక్కువగా హాలీవుడ్ టైం గడిపే సరికి ఆ వాతావ‌ర‌ణం ప్రియాంక‌కు బాగా న‌చ్చిన‌ట్లు ఉంది. అందుకే మ‌రిన్ని హాలీవుడ్ సినిమాల‌పై క‌న్నేసింది. హాలీవుడ్ లో ఏ ఫంక్ష‌న్ జరిగినా హాట్ దుస్తుల‌తో కుర్ర‌కారును వేడెక్కిస్తోంది. మొన్న‌టికి మొన్న ఓ మ్యూజిక్ అవార్డుల ఫంక్ష‌న్‌లో నీలి రంగు గౌనులో మెరిసిపోయింది. ఇప్పుడ ‘కాంప్లెక్స్’ అనే అంత‌ర్జాతీయ మేగ‌జైన్స్ క‌వ‌ర్ పేజీ మీద వయ్యారాలు ఒల‌క‌బోసింది. ఇదంతా చూసిన బాలీవుడ్ అభిమానులు హాలీవుడ్ మీద మ‌రీ ఇంత ప్రేమా..? అంటున్నారు.

To Top

Send this to a friend