ప్రారంభమైన “శిఖండి”


శ్రీ చర్ల మూవీస్ పతాకం పై చర్ల శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తోన్న చిత్రం “శిఖండి”. పి.రాజారెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. నూతన నటీనటులు భరత్, భింభిక నటిస్తోన్న ఈ సినిమా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం పఠాన్ చెరువు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ప్రముఖ నిర్మాత లయన్ వెంకట్ హీరోయిన్లకు క్లాప్ ఇచ్చి ముహర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శనిర్మాతలు తెలిపారు. 30 రోజులకి పైగా ఈ సినిమా చిత్రీకరణ జరపడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. హైదరాబాద్ లో టాకీ, కర్ణాటకలోని కూర్గ్, మహాబలేశ్వర్ తదితర లోకేషన్స్ లో సాంగ్స్ షూట్ చేసేందుకు ఈ మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు డి.ఓ.పి – హరీశ్ ఎస్.ఎన్, ఎడిటింగ్ – ఆవుల వెంకటేశ్, సంగీతం – సంజీవ్ మెగోటి.

To Top

Send this to a friend