ప్రభాకర్, అలీ కాంబినేషన్‌లో `కాళ‌కేయ వ‌ర్సెస్ కాట్ర‌వ‌ల్లి`

kalakeya-katravalli-apnewsonline

బాహుబలి సినిమాలో కాళకేయ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో రాజమౌళి సృష్టించిన కాళకేయుడి పాత్రలో ప్రభాకర్ నటింగా ఈ పాత్రకుప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పుడు ప్రభాకర్‌తో పాటు స్టార్ క‌మెడియ‌న్ అలీ లీడ్ రోల్స్‌లో రూపొందుతోన్న చిత్రం `కాళ‌కేయ వ‌ర్సెస్ కాట్ర‌వల్లి`. త‌న‌దైన కామెడితో, పంచ్‌ల‌తో కామెడీకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన అలీ, ప్రభాకర్ కాంబినేషన్‌లో ఓగిరాల మూవీస్ బ్యాన‌ర్‌లో శ్రీపురం కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో వేమూరి నాగేశ్వ‌ర‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం సాంగ్స్ రికార్డింగ్ కార్య‌క్ర‌మం డిసెంబ‌ర్ 15న స్టార్ట్ అయ్యింది. జ‌న‌వ‌రి నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై దాస‌రి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రూపొందిన స‌క్సెస్‌ఫుల్ మూవీ `రామ్‌లీల‌`ను తెర‌కెక్కించిన శ్రీపురం కిర‌ణ్ ఈ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కించ‌నున్నారు. గోపాల గోపాల చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన దేవుడి క్యార‌క్ట‌ర్ త‌ర‌హా పాత్ర‌లో కాళ‌కేయ వ‌ర్సెస్ కాట్ర‌వ‌ల్లి చిత్రంలో ఓ ప్ర‌ముఖ న‌టుడు న‌టించ‌బోతున్నారు.
అలీ, కాళ‌కేయ ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుక్కు సంగీతం అందిస్తుండ‌గా చంద్ర‌బోస్ సాహిత్యాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ముర‌ళీమోహ‌న్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీని వ‌ర్క్‌ను అందిస్తున్నారు

To Top

Send this to a friend