ప్రతీ ఫ్రెండు అవసరమే.. కేసీఆర్, వెంకయ్య ల దోస్తీ..

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. మిత్రులు, శత్రువులు కావచ్చు.. దుమ్మెత్తిపోసుకున్న వారు అంటకాగవచ్చు.. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను పనిగట్టుకొని ఏపీలో కలిపేయడంలో వెంకయ్య-చంద్రబాబు ధ్వయం విజయం సాధించింది. అప్పట్లో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు కరెంట్ , తదితర విషాయాల్లో సహకరించి తెలంగాణ కు అన్యాయం చేసిందనే అపవాదు ఉంది. కేసీఆర్ ఈ విషయంలో బహిరంగంగా మోడీని, వెంకయ్య, చంద్రబాబును తిట్టిపోశాడు.. కానీ ఆ తర్వాత ఆ శత్రువులే ఇప్పుడు మిత్రులయ్యారు.. దోస్తీ ఎంత బాగా కుదిరిందంటే ఇప్పుడు కేంద్రంలో ఏ పని కావాలన్న కేసీఆర్ కు మొదట గుర్తుకు వచ్చేది వెంకయ్యే.. అందుకే వెంకయ్య ఎప్పుడు పిలిచినా ఏ ఫంక్షన్ కు రమ్మన్నా ఠక్కున అక్కడ వాలిపోతున్నాడు కేసీఆర్.. ఓ రకంగా ఇప్పుడు చంద్రబాబు-వెంకయ్యల మిత్రత్వం కంటే కూడా కేసీఆర్ వెంకయ్యతో బాగా కలిసిపోయారు.

గ్రామాల అభివృద్ది, సేవనే ప్రధాన ధ్యేయంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూతురు దీపా వెంకట్ సారథ్యంలో స్వర్ణభారత్ ట్రస్టు సేవలందిస్తోంది. ఈ ట్రస్టు సేవల్ని తెలంగాణలో కూడా విస్తరించాలని వెంకయ్య భావించారు.దానికి కేసీఆర్ ను అడగడం ఆయన ఓకే అనడం.. స్వయంగా ట్రస్టు ప్రారంభానికి రావడం జరిగిపోయాయి. శంషాబాద్ మందడలం ముచ్చింతలలో స్వర్ణభారత్ ట్రస్టు హైదరాబాద్ చాప్టర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై కేసీఆర్ ను వెంకయ్య సన్మానించారు. స్వర్ణభారత్ ట్రస్టు, ప్రభుత్వం కలిసి పనిచేస్తామని వెంకయ్య చెప్పారు. యువతకు ఉపాధి, శిక్షణను ఈ ట్రస్టు నిర్వహిస్తుంది.. మాతృభాష, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుందట.. ఇలా వెంకయ్య ట్రస్టుకు కేసీఆర్ సహకారం.. కేసీఆర్ కు వెంకయ్య సహకారంతో వారిద్దరి మధ్య దోస్తీ ఇప్పుడు బాగా ముదిరిపోయింది..

To Top

Send this to a friend